అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఈ విషయంపై వార్తని ప్రచురించింది. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో అక్కినేని నాగార్జునకి ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానం ఇవ్వకుండా దాటేశారు. సరైన సందర్భం చూసుకుని ఎలా విశేషాన్ని అయినా అధికారికంగా ప్రకటిస్తామని నాగార్జున చెప్పుకొచ్చారు.
అందుకే ఈ వార్త వైరల్ గా మారింది అని అర్ధం చేసుకోవచ్చు. చైతన్య- శోభిత గతేడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి కొద్దిపాటి బంధుమిత్రులు, ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఏడాది సమ్మర్ నుండి శోభిత తన డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది అని నెటిజెన్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. దాని వెనుక అసలు కారణం అదే అని ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే.. నాగ చైతన్య గతంలో సమంతని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2017 లో పెళ్లి చేసుకున్న వీళ్ళు.. 2021 లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. సమంత కూడా ఇటీవల ఫ్యామిలీ మెన్ దర్శకుడు రాజ్ నిడిమోరుని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల పరంగా చూసుకుంటే నాగ చైతన్య ఈ ఏడాది ‘తండేల్’ తో ఓ పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ప్రస్తుతం ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో ఓ అడ్వెంచరస్ డ్రామా సినిమా చేస్తున్నాడు.
