సన్నబడ్డ ‘దేవసేన’..!
- May 16, 2016 / 01:33 PM ISTByFilmy Focus
వైవిధ్య భరితమైన పాత్రల్లో ఒదిగిపోయే అనుష్క శెట్టి.. ‘సైజ్ జీరో’ చిత్రంలో తాను నటించిన స్వీటి పాత్ర కోసం దాదాపు 20 కిలోలు పెరిగింది. ఆ పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క ఇప్పుడు ‘బాహుబలి ది కంక్లూషన్’ చిత్రం కోసం మళ్ళీ బరువు తగ్గి మునుపటి రూపు సంతరించుకోంది.
నేచురల్ థెరపీ ద్వారా ఆమె ఆరునెలల్లో తన బరువును తగ్గించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సూర్య సరసన ఎస్3, బాహుబలి చిత్రాల్లో నటిస్తుండగా.. త్వరలోనే బాహుబలి చిత్ర బృందం తో కలవనుంది. మరోవైపు చిరు సరసన నటించే అవకాశాన్ని కూడా ఆమె కొట్టేసిందని వార్తలు వినవస్తున్నాయి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












