Anushka, Samantha: నటి అనుష్కకు కృతజ్ఞతలు తెలిపిన నిర్మాత నీలిమ గుణ!

ప్రస్తుత కాలంలో స్టార్ సెలబ్రిటీల సినిమాలో మరి కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లు సందడి చేయడం ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది హీరోల సినిమాలలో స్టార్ సెలబ్రిటీలు అతిథి పాత్రల ద్వారా సందడి చేస్తున్నారు. తాజాగా నటి అనుష్క అనుష్క సైతం సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా తర్వాత నిశ్శబ్దం అనే సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది ఈ సినిమా అనంతరం అనుష్క పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. అయితే ఈమె వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే యు వి క్రియేషన్ బ్యానర్ లో నవీన్ పోలీస్ శెట్టితో కలిసి అనుష్క ఓ సినిమాలో చేయబోతున్నారని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైనప్పటికీ అనుష్క ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనలేదు. తాజా సమాచారం ప్రకారం అనుష్క సమంత నటించిన శాకుంతలం సినిమాలో నటించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ విషయంపై శాకుంతలం నిర్మాత నీలిమ గుణ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అనుష్క శాకుంతలం సినిమాలో నటించలేదు. తను మా పక్కనే ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు తనకు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అనుష్క శాకుంతలం సినిమాలో నటించలేదనే విషయంపై క్లారిటీ వచ్చింది. అనుష్క గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాలో నటించారు.

ఈ సినిమా నుంచి గుణశేఖర్ ఫ్యామిలీతో అనుష్కకు మంచి అనుబంధం ఉంది. అందుకోసమే శాకుంతలం సినిమా షూటింగ్ సమయంలో కూడా అనుష్క తనకు సపోర్ట్ చేశారని నిర్మాత నీలిమ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించిన విషయం మనకు తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం గురించి తెలియాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus