అనుష్క శెట్టి ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా ట్రెండ్ అవుతుంది. వెండితెరపై ఎంత గ్లామర్ గా కనిపించినా కూడా ఆఫ్ స్క్రీన్ మాత్రం స్వీటీ చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత రాత్రి నుంచి ఇంటర్నెట్ వరల్డ్ లో అనుష్క పేరు ట్రెండ్ అవుతుండడం ఎవరికి అర్థం కాలేదు.
వీలైనంత వరకు ప్రయివేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడే జేజమ్మ పర్సనల్ లైఫ్ లో ఒక సాధారణ అమ్మాయిలానే ఉంటుందని ఇటీవల లీక్ అయిన మరొక ఫొటోతో అర్ధమయ్యింది. చాలా సింపుల్ గా ఒక గోడ పక్కన నిలబడి స్మైల్ ఇచ్చేసింది. ఆ స్మైల్ తోనే చంపేసింది అంటూ కుర్రాళ్ళు కొంటెగా కామెంట్ చేస్తున్నారు. సరదాగా దిగిన ఆ ఫొటోలో నిజంగా అనుష్క ఎంత బావుందో అంటూ అమ్మయిలు కూడా ఈర్ష లేకుండా షేర్ చేస్తున్నారు.
అనుష్క ఇతర యాడ్స్ లలో కూడా ఎక్కువగా నటించడం లేదు. ఆమెకు ఆఫర్స్ చాలానే వస్తున్నప్పటికి డబ్బుకు ఆశపడి అనవసరమైన బ్రాండ్స్ ను ఎంకరేజ్ చేయడం లేదు. ఇక సినిమాల ఎంపిక విషయంలో కూడా ఆమె చాలా తెలివిగా అడుగులు వేస్తోంది. కంటెంట్ ఉన్న విభిన్నమైన సినిమాలనే ఓకే చేస్తోంది. నెక్స్ట్ అనుష్క, నవీన్ పొలిశెట్టితో ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ డ్రామాతో రాబోతోంది.