Anushka Shetty: అనుష్క చివరి చిత్రం అదేనా… స్వీటీ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారా?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి వచ్చినటువంటి వారిలో నటి అనుష్క శెట్టి ఒకరు. 2005వ సంవత్సరంలో సూపర్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయినటువంటి ఈమె కెరియర్ మొదట్లో పలు గ్లామరస్ పాత్రలలో నటించారు. అయితే ఈమె కెరీర్ కు అరుంధతి సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఒక్కసారిగా అనుష్క ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో సినిమాలను పూర్తిగా తగ్గించేశారు.

సైజ్ జీరో వంటి ప్రయోగాత్మక సినిమా కోసం అనుష్క భారీగా శరీర బరువు పెరిగారు. ఇలా శరీర బరువు పెరిగినటువంటి ఈమె తిరిగి సన్నబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో మంచి సినిమా అవకాశాలను కూడా కోల్పోయారు. ఇలా చాలా రోజుల తర్వాత బాహుబలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అనుష్క (Anushka Shetty) పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా అనంతరం ఈమె నిశ్శబ్దం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అసలు ఈ సినిమా విడుదలైందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇలా ఈ సినిమా తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి అనుష్క సినిమాలకు దూరమయ్యారు అంటూ ఓ వార్త హల్చల్ చేసింది. ఇక ఈమె చాలా రోజుల తర్వాత నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని తెలియజేశారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది అయితే ఈ సినిమా తర్వాత అనుష్క సినిమాల పరంగా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత అనుష్క పూర్తిగా ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus