సాహో చిత్ర యూనిట్ తో కలిసి సందడి చేసిన అనుష్క

బిల్లా.. మిర్చి.. బాహుబలి.. చిత్రాలతో అనుష్క, ప్రభాస్ బెస్ట్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. దీంతో వారిపైన అనేక రూమర్లు వచ్చాయి. మేము స్నేహితులం మాత్రమేనని ఎన్నిసార్లు చెప్పినా విపించుకోలేదు. అందుకే బయట కలిసి కనిపించడం మానేశారు. అయినా స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. బాహుబలి తర్వాత అనుష్క నటించిన బాగమతి టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు తన పేస్ బుక్ అకౌంట్ లో అనుష్కపై ప్రభాస్ అభినందనలు గుప్పించారు. తాజాగా అనుష్క కూడా స్నేహితుడిని కలుసుకునేందుకు సాహో సెట్స్ కి వెళ్ళింది. బాహుబలి తర్వాత ప్రభాస్… సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్‌ నటిస్తోంది. ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న సాహో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దుబాయ్ లో ఓ యాక్షన్ సీన్ ప్లాన్ చేస్తే.. అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో హైదరాబాద్ లోనే భారీ సెట్ వేసి కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సెట్ కి నిన్న అనుష్క వెళ్ళింది. చిత్ర యూనిట్ తో కలిసి సందడి చేసింది. డైరక్టర్ సుజీత్, నటుడు ముర‌ళీశ‌ర్మ‌, సినిమాటోగ్రాఫ‌ర్‌ మది తో కలిసి స్వీటీ తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా షేర్లు అందుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus