వెంకటేష్ కొత్త చిత్రంలో హీరోయిన్ గా అనుష్క!

చింతకాయల రవి చిత్రంలో వెంకటేష్ అనుష్కను చాలా బాగా ఆటపట్టించారు. ఇప్పుడు మరోసారి స్వీటీతో ఆడుకోనున్నారు. అదేనండీ వారిద్దరూ కలిసి నటించబోతున్నారు. గురు సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తేజ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ సుంకర, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. నేనే రాజు నేనే మంత్రి మూవీ తర్వాత తేజ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఆట నాదే వేట నాదే అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అనుష్క ఖరారు అయినట్లు తెలిసింది. ఇందులో వెంకీ ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఆ రోల్ కి సరైన జోడి అనుష్క అయితేనే బాగుంటుందని భావించిన యూనిట్ ఆమెను ఓకే చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం అనుష్క “భాగమతి” సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసి రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో వెంకటేష్ పక్కన అడిగే సరికి ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆమె సంతకాలు పూర్తికాగానే అధికారికంగా ప్రకటించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఎ.కె. ఎంటర్‎టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా వెంకటేశ్ బర్త్ డే ( డిసెంబర్ 13 )న రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇందులో ఓ కీలక రోల్లో డాక్టర్ రాజశేఖర్ నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus