అనుష్క కాదు.. ముందుగా మహేష్ పక్కన ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారు..!

  • June 7, 2020 / 05:00 PM IST

మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు రెండు ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేసాయి. ‘అతడు’ సినిమా మహేష్ బాబుకి ఫ్యామిలీ ఇమేజ్ ను తెచ్చిపెట్టడంతో పాటు ఓవర్సీస్ లో అతనికి మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో… ఈ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘ఖలేజా’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేదు. జనాలు ఈ చిత్రాన్ని థియేటర్లలో ఆదరించలేదు. కానీ టీవీల్లో మాత్రం ఇప్పటికీ ఆదరిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందా అని కామెంట్లు కూడా చేస్తుంటారు కొందరు నెటిజన్లు.

సరే ఈ చిత్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి.. ఫలితం గురించి ఫీలవ్వడం ఎందుకు చెప్పండి. ఇక అసలు మ్యాటర్ కు వస్తాను. ఈ చిత్రంలో మహేష్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది. ‘అసలు ఈ పెయిర్ సెట్ అవ్వలేదు, అనుష్క … మహేష్ కు అక్కలా ఉంది’ అంటూ అప్పట్లో విమర్శలు గుప్పించారు. అయితే ఈ చిత్రంలో ముందుగా అనుష్క ను కాదు.. వేరే హీరోయిన్ ను అనుకున్నారట. ఆమె ఎవరో కాదు పార్వతీ మెల్టన్. ‘వెన్నెల’ చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ ‘మధుమాసం’ ‘జల్సా’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే ‘జల్సా’ సినిమా రిలీజ్ అయిన వెంటనే మహేష్ తో సినిమా స్టార్ట్ చెయ్యాలి అని భావించిన దర్శకుడు త్రివిక్రమ్… పార్వతీ మెల్టన్ నే హీరోయిన్ గా ఫైనల్ చేసాడట.

అందుకు మహేష్ కూడా ఓకే చెప్పాడు. కానీ ఈ సినిమా అనుకున్న సమయం కంటే కూడా లేట్ గా మొదలయ్యింది. దాంతో హైప్ కూడా భారీగా పెరిగిపోవడం చూసి అప్పటికి పెద్దగా హిట్లు లేని పార్వతీ మెల్టన్ ను తప్పించి.. ‘అరుంధతి’ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనుష్క అయితే .. ఆ హైప్ ను బ్యాలన్స్ చెయ్యొచ్చు అని భావించి ఆమెనే ఫైనల్ చేశారట.అయితే పార్వతీ మెల్టన్ డిజప్పాయింట్ అయ్యింది అని తెలుసుకున్న మహేష్… తన తరువాతి చిత్రం ‘దూకుడు’ లో ఓ స్పెషల్ సాంగ్ కు ఆమెను రికమండ్ చేసాడట. ఆ సాంగ్ సూపర్ హిట్ అయితే అయ్యింది కానీ పార్వతీ మెల్టన్ కు మాత్రం ఏమీ కలిసి రాలేదు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus