దక్షిణాది చిత్ర పరిశ్రమలో అనుష్కకి క్రేజ్ మామూలుగా లేదు. ఉత్తరాదిలోను ఆమె సినిమాలను చూసేవారున్నారు. అలాంటి సమయంలో స్వీటీ కామ్ గా ఉంటోంది. బాహుబలి తర్వాత భాగమతి అనే సినిమాని మాత్రమే చేసింది. ఇది కూడా సూపర్ హిట్. ఆ తర్వాత రచయిత కోనవెంకట్ దర్శకత్వంలో సినిమాకి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అలాగే తమిళంలో గౌతం మీనన్ డైరక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎప్పటి నుంచో చెప్పుకున్నారు. కానీ ఈ రెండు సినిమాలను క్యాన్సిల్ చేసుకొని ఆస్ట్రియాకి వెళ్లింది. ఎందుకని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. బరువుని తగ్గించుకోవడానికి వెళ్ళిందంట. “సైజ్ జీరో” సమయంలో బరువు పెరిగింది. సులువుగా తగ్గించుకోవచ్చని అనుకుంది.
కానీ అప్పటి నుంచి తగ్గాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హార్మోనల్ సమస్యలు తలెత్తడంతో కొన్ని రోజులు బరువు తగ్గే ప్రయత్నం మానేసింది. ఆస్ట్రియాలో ఒక వైద్యుడు సహజ పద్దతుల్లో బరువు తగ్గిస్తారని తెలుసుకుంది. బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా ఇంతకుముందు బొద్దుగా ఉండేది. ఇప్పుడు సైజ్జీరోకి వచ్చింది. దానికి కారణం.. ఆస్ట్రియా వైద్యమేనని సమాచారం. అందుకే అనుష్క కూడా అక్కడికి వెళ్లినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. బాగా కష్టపడుతోందంట. ఈ ప్రయత్నం సఫలం అయితే హీరోయిన్ గా చిత్రాలు చేస్తుందని భావిస్తున్నారు.