అనుష్క నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. దీని తర్వాత ఆమె చేస్తున్న సినిమా భాగమతికి కూడా విడుదల తేదీని ఖరారు చేశారు. పిల్ల జమీందార్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యువీ క్రియేషన్స్ వాళ్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తోంది.

అరుంధతి, రుద్రమదేవి తరహాలో ఈ ఈ రోల్ ఆమెకి మంచి గుర్తింపుని ఇస్తుందని చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఇది చారిత్రాత్మక కథ కాదని స్పష్టం చేసింది. ఇప్పటికీ దాదాపు 50 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఆగస్టు 11 న రిలీజ్ చేయనున్నట్లు వంశీ, ప్రోమోద్ లు ప్రకటించారు. లేడీ ఓరియెంటెడ్ కథలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న స్వీటీ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus