ఎట్టకేలకు రిలీజవుతున్న భాగమతి!

  • October 20, 2017 / 07:05 AM IST

ఈ మధ్యకాలంలో అనుష్క నటించగా “బాహుబలి” కాకుండా అత్యధిక రోజులు షూటింగ్ జరుపుకొన్న ఏకైక చిత్రం “భాగమతి”. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ జోనర్ ఏంటో కూడా ఇంకా క్లారిటీ లేని చిత్రంలో అనుష్క పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. “పిల్ల జమీందార్” ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. ఈలోపు అనుష్క నటించిన “సైజ్ జీరో, బాహుబలి 2” రిలీజ్ కూడా అయిపోయాయి. ఇంకా “భాగమతి” షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.

నిజానికి ఈ చిత్రం 2017 ప్రధామార్ధంలోనే విడుదలవ్వాలి. కానీ.. ద్వితీయార్ధం ముగుస్తున్నప్పటికీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు మొదలవ్వకపోవడంతో.. యువీ క్రియేషన్స్ సైతం సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇకపోతే.. “బాహుబలి 2” అనంతరం అనుష్క మరో సినిమా సైన్ చేయకపోవడంతో ఆమె అభిమానులందరూ “భాగమతి” ఎప్పుడు రిలీజావుతుందా అని వెయిట్ చేస్తుంటే.. టీం మెంబర్స్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రెస్ రిలీజ్ కానీ ఎనౌన్స్ మెంట్ కానీ చేయకపోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే గమనించడం మొదలెట్టిన యువీ క్రియేషన్స్ డిసెంబర్ లో సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారట. అది ఎంతవరకూ కరెక్ట్ అనేది తెలియదు కానీ.. ఈలోపు అనుష్క ఇంకో సినిమా సైన్ చేస్తే మాత్రం బాగుండు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus