Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నిను వీడని నీడను నేనే’ ప్రేక్షకులందరికీ నచ్చుతోంది! : హీరోయిన్ అన్యా సింగ్

నిను వీడని నీడను నేనే’ ప్రేక్షకులందరికీ నచ్చుతోంది! : హీరోయిన్ అన్యా సింగ్

  • July 15, 2019 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిను వీడని నీడను నేనే’ ప్రేక్షకులందరికీ నచ్చుతోంది! : హీరోయిన్ అన్యా సింగ్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) విడుదలైంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు అన్యా సింగ్ కథానాయికగా పరిచయం అయ్యారు. విడుదలైన రోజు నుంచి చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో అన్యా సింగ్ మీడియాతో ముచ్చటించారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి?

actress-anya-singh-special-interview1

మాది ఢిల్లీ. నేను అజ్మీర్ లోని బోర్డింగ్ స్కూల్ లో చదువుకున్నా. డిగ్రీ కోసం మళ్లీ ఢిల్లీ వచ్చా. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ నా సబ్జెక్ట్స్. నిజానికి సైకాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ, సైకాలజీలో డిగ్రీ చేయాలంటే స్ట్రిక్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి. అందుకని మానేశా‌. బోర్డింగ్ స్కూల్ లో చదివిన తర్వాత మళ్లీ స్ట్రిక్ట్ యూనివర్సిటీకి వెళ్లాలనిపించలేదు. కాలేజీ లో ఉన్నప్పుడు వెడింగ్ ప్లానర్ ఒకరితో కలిసి పనిచేశా. చిన్నప్పటినుంచి నటన అంటే ఇష్టం. అందుకని చదువు పూర్తయిన తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యాను.

శుక్రవారం సినిమా విడుదల అయింది. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది?

actress-anya-singh-special-interview2

గ్రేట్ రెస్పాన్స్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ సూపర్ అని అని క్లాస్ మాక్స్ లో ఎమోషనల్ సీన్స్ తమ మనసును కదిలించాయని చెబుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం నేను కొంచెం టెన్షన్ పడ్డాను. సుమారు 11 గంటల సమయంలో ఎవరో బాలేదని రాస్తే చదివాను. నిరాశతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హోటల్ కి వెళ్లిపోయా. మా అమ్మకు అంతకుముందే ఫోన్ చేసి చెప్పాను. మధ్యాహ్నం తర్వాత మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సీతారమ్ ఫోన్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్ కి రమ్మని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఇంటర్నెట్ లో చూశా. సోషల్ మీడియాలో, రివ్యూస్ లో సినిమా చాలా బాగుందని రాశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు బాగున్నాయి. థియేటర్ల సంఖ్య ను పెంచుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి. ఐ యాం సో హ్యాపీ.

విడుదలైన రోజు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు కదా. ప్రేక్షకుల్ని నేరుగా కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు?

actress-anya-singh-special-interview3

సినిమా ఈ రోజే విడులైంది కదా ఎక్కువమంది చూశారో లేదో అనుకున్నాను. శుక్రవారం సాయంత్రానికి చాలా మంది చూశారు. మెట్రో లో వెళ్ళినప్పుడు ప్రేక్షకులు సన్నివేశాల గురించి చెబుతుంటే సంతోషంగా అనిపించింది. ఎక్కువమంది నన్ను గుర్తు పట్టలేదు. ఒక్క చిత్రమే చేశాను కదా! నన్ను గుర్తు పట్టకున్నా..‌‌‌. సినిమా చూశామని చెబితే సంతోషించా. సందీప్ కిషన్ చుట్టూ ప్రేక్షకులు గుమిగూడారు. తనతో సెల్ఫీలు తీసుకోవటానికి ఎదురు చూశారు.

ఈ సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చింది?

actress-anya-singh-special-interview4

మా హీరో సందీప్ కిషన్, దర్శకుడు కార్తీక్ రాజు నా తొలి హిందీ సినిమా ‘Qaidi Band’ చూశారు. అందులో నా నటన నచ్చి ఈ అవకాశం ఇచ్చారు.

ఈ సినిమా సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని సందీప్ కిషన్ చెప్పారు. ఏమైంది?

actress-anya-singh-special-interview5

క్యాన్సర్ వలన మా నాన్నగారు మరణించారు. నాకు తీరని లోటును మిగిల్చి వెళ్లిపోయారు. నాన్న మరణంతో షాక్ లోకి వెళ్లాను. తర్వాత ‌ నెమ్మదిగా కోలుకున్నాను

‘నిను వీడని నీడను నేనే’లో నటనకు ఆస్కారమున్న పాత్ర చేశారు. ఒక సన్నివేశంలో దెయ్యంగాను కనిపించారు. సినిమాలో మీరు బాగా కష్ట పడిన సన్నివేశం ఏది?

actress-anya-singh-special-interview6

హారర్ సన్నివేశంలో ఈజీగానే నటించేశా. కానీ, ఎమోషనల్ సన్నివేశాలు చేసేటప్పుడు కొంచెం కష్టపడ్డాను. సినిమాలో నా పాత్ర చూస్తే… చాలా ఎమోషనల్ అండ్ కన్ఫ్యూజ్ క్యారెక్టర్. ఎక్కువ సన్నివేశాల్లో ఏడుస్తూనే కనిపిస్తా. ప్రేక్షకులకు తెరపై పాత్ర తాలూకు భావోద్వేగాలను కనెక్ట్ అయ్యేలా నటించడం చాలా కష్టం. షూటింగ్ ప్రారంభం కావడానికి 20 రోజుల ముందు నాకు కథ చెప్పారు. కొంచెం ప్రిపేర్ అయ్యాను.

మీకు హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా?

actress-anya-singh-special-interview7

హారర్ ఇష్టం లేదు. కొంచెం భయపడతా… చూడటానికి, చేయటానికి. థ్రిల్లర్స్ అంటే ఇష్టం. హాలీవుడ్ మూవీ ‘సెవెన్’ నాకు ఇష్టమైన థ్రిల్లర్ సినిమా. ‘నిను వీడని నీడను నేనే’ హారర్ కాదు కదా. సినిమాలో హారర్ సన్నివేశం ఒక్కటే ఉంది. అది చేసేటప్పుడు చుట్టూ జనాలు ఉన్నారు. అయినా… రాత్రిపూట తీయడంతో కొంచెం టెన్షన్ పడ్డాను. ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే… థ్రిల్లర్ అయినా ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్ కూడా బావుంటుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది.

సినిమాలో జరిగినట్టు నిజ జీవితంలో మీకు అద్దంలో ఎవరైనా కనిపిస్తే?

actress-anya-singh-special-interview8

అమ్మో! హార్ట్ ఎటాక్ వస్తుంది. అద్దంలో నాకు నేనే కనిపించాలి. నా బదులు వేరే వాళ్ళు కనిపించాలని అస్సలు కోరుకోను.

సందీప్ కిషన్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్?

actress-anya-singh-special-interview9

వెరీ కంఫర్టబుల్! నాకు తెలుగు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అందువల్ల, షూటింగ్ జరిగేటప్పుడు సందీప్ కిషన్ ఎంతో హెల్ప్ చేశాడు. నాకు డైలాగులు అర్థం కాకపోతే వివరించి చెప్పేవాడు. సందీప్ కిషన్ కి సినిమాలంటే ఎంతో ప్రేమ. వెరీ టాలెంటెడ్ యాక్టర్. కమిట్ మెంట్ తో వర్క్ చేస్తాడు. సన్నివేశం బాగా రావడానికి ఎంత కష్ట పడటానికి అయినా వెనుకాడడు. అతనితో పాటు మా దర్శకుడు కార్తీక్ రాజు కూడా నాకు బాగా సహకరించారు.

ఈ సినిమాకు గాను మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?

actress-anya-singh-special-interview10

ప్రేక్షకుల్లో ఎక్కువశాతం మంది నేను సహజంగా నటించానని చెప్పారు. నేచురల్ యాక్టర్ అనడం బాగుంది. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. పరవాలేదు.

తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?

actress-anya-singh-special-interview11

కొంతమంది నిర్మాతలు అప్రోచ్ అయ్యారు. అయితే…‌ ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాం. హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉంది. ఒక సినిమా చేశా. త్వరలో మిగతా రెండు చేస్తా. అమెజాన్ నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను చూస్తున్నారు. మంచి కథ, పాత్ర లభిస్తే నేను ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anya Singh
  • #Ninu Veedani Needanu Nene Movie
  • #Sundeep Kishan

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

6 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

11 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

11 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

12 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

13 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

1 hour ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

7 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

8 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

9 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version