జూలై 1న ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కాబోతున్న ‘అన్యాస్ ట్యుటోరియల్’ పై ప్రేక్షకుల్లో పెరిగిన ఆసక్తి..!

ప్రస్తుతం టాప్ ఆర్డర్ లో దూసుకుపోతున్న ఓటీటీ సంస్థ ‘ఆహా’… ప్రతీవారం విభిన్న పద్దతిలో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ ప్రేక్షకులకు కూడా ‘ఆహా’ బాగా చేరువైంది.కొత్త కొత్త వెబ్ సిరీస్ లతో, సినిమాలతో ప్రేక్షకులకు 100 శాతం ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న ‘ఆహా’ నుంచి రాబోతున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’ . జూలై 1 నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

‘బాహుబలి’ నిర్మాతలైన ‘ఆర్కా మీడియా’ వారు ‘ఆహా’ తో కలిసి నిర్మించిన ఒరిజినల్ సిరీస్ ఇది. రెజీనా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఏడు ఎపిసోడ్లు గా టెలికాస్ట్ కానుంది.ప‌ల్లవి గంగిరెడ్డి ద‌ర్శకురాలు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ కావాలనుకునే అన్య(నివేదితా) ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండగా అన్య అక్క మధు(రెజీనా)కు చెల్లి ప్రొఫెషన్ అస్సలు నచ్చదు. అయితే అన్య చేసిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతాయి.

ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగేలా ఆ వీడియోలు చేస్తాయి.ఇదే క్రమంలో అన్య జీవితంలో చిత్ర, విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అన్యాస్ ట్యుటోరియల్ ఫాలో అవుతున్న కొంతమంది పిల్లలు వాళ్ల ఇళ్లలో నుంచి మాయమవుతూ ఉంటారు. ఆ తర్వాత అన్య కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది.

రెజీనా జీవితంలోనూ కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అసలు అన్య, రెజీనా జీవితంలో వచ్చిన మార్పులకు కారణమేంటి? అన్యా’స్ ట్యుటోరియల్ ను ఫాలో అయ్యే పిల్లలు ఏమయ్యారు? అనే పాయింట్ తో ఈ సిరీస్ రూపొందింది.ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సిరీస్ చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువ కలిగింది. క్రమక్రమంగా అది పెరుగుతూనే వస్తుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus