Akhanda Movie: ఏపీలో బాలయ్య సినిమాకు లెక్క తేలడం లేదట!

2021లో టాలీవుడ్‌లో వసూళ్ల పరంగా మంచి విజయాలు అందుకున్న సినిమాలు అంటే వకీల్‌ సాబ్‌, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు, క్రాక్‌, లవ్‌స్టోరీ, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. అయితే ఏపీలో మంచి వసూళ్లు వచ్చిన సినిమాల పేర్లు అంటే… ఒక్కటి కూడా రావు. కారణం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ‘అఖండ’ విషయంలో అదే ఇబ్బంది వచ్చింది కాబట్టి మరోసారి చర్చించుకోవడం మంచిది. ఇంకేముంది ఏపీలో టికెట్‌ ధరలు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ కొట్టిన సినిమా ‘అఖండ’.

ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపే వసూళ్లతో సాగిపోతోంది. అయితే ఏపీలో మాత్రం అంతంతమాత్రంగానే డబ్బులు వస్తున్నాయని టాక్‌. కారణం సినిమాకు సత్తా లేకపోవడం కాదు. టికెట్‌ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. దీంతో భారీ వసూళ్లు ఖాయమనుకున్న నిర్మాత… ఉసూరుమంటున్నారట. ‘అఖండ’ ఇప్పటికే రూ.100 కోట్ల‌కు పైగా గ్రాస్, రూ.60 కోట్ల‌కు పైగా షేర్ రాబట్టిన విషయం తెలిసిందే. ఏపీ టికెట్‌ ధరలు ఒకప్పటిలా ఉంటే ఈ నెంబరు ఇంకా పెద్దగా ఉండేదని టాక్‌.

ఆంధ్రాలో ఈ చిత్రాన్ని సుమారు ₹26 కోట్ల‌కు అమ్మితే ఇప్ప‌టిదాకా ₹21.5 కోట్ల షేరే వచ్చిందంటున్నారు. ఏపీలో టికెట్ల రేట్ల‌పై నియంత్రణ ఉండ‌టంతో బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోలేక‌పోయిందంటున్నారు. నైజాంలో ₹10.5 కోట్ల‌కు కొన్న దిల్ రాజు.. ₹ఏడు కోట్ల లాభంతో ఉన్నారట. సీడెడ్‌లో ₹15 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్ప‌టికే ₹12 కోట్ల దాకా షేర్ వచ్చిందట. సో ‘అఖండ’ ఆంధ్ర దెబ్బ గట్టిగానే ఉందంటున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus