పవన్ కళ్యాణ్ మీద పగతో రద్దు చేసిన జీవో నెంబర్ 35 ని అమల్లోకి తెచ్చి.. టికెట్ రేట్లు పెంచకుండా చాలా డ్రామాలు ఆడింది జగన్ ప్రభుత్వం. కానీ మొన్నటికి మొన్న కొత్త జీవోని(కొత్త జీవోని) విడుదల చేయడంతో ‘రాధే శ్యామ్’ వంటి పాన్ ఇండియా సినిమాకి కలిసొస్తుందని అని అంతా అనుకున్నారు. బెనిఫిట్ షోలు పడతాయి, టికెట్ రేట్ల హైక్ ఉంటుంది అని ‘రాధే శ్యామ్’ భావించింది కానీ కట్ చేస్తే.. జగన్ ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చినట్టే స్పష్టమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో 20శాతం షూటింగ్ చేసిన సినిమాలకి, పారితోషికాలు కాకుండా 100 కోట్లకి పైగా బడ్జెట్ అయిన సినిమాలకి మాత్రమే 10రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే సదుపాయం కల్పించినట్టు ఆ జీవోలో మెన్షన్ చేసింది. కానీ రాధే శ్యామ్.. షూటింగ్ ఆంధ్రాలో జరగలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ అయితే కొంత భాగం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. కాబట్టి దానికి అడ్డంకి లేదు. ‘రాధే శ్యామ్’ విషయంలో మాత్రం అలా జరగలేదు.
అభిమానులు ‘రాధే శ్యామ్’ టికెట్లు ఎప్పుడు ఇస్తారు, బెనిఫిట్ షో ఎప్పుడు పడుతుందా అని థియేటర్ల వద్ద పడిగాపుకులు కాస్తున్నారు. మరోపక్క ‘రాధే శ్యామ్’ ను కచ్చితంగా మొదటి రోజు చూడాలనుకునే ప్రేక్షకులు బుక్ మై షో యాప్ ను ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నారు. కానీ టికెట్లు అయితే అందులో పెట్టలేదు. మరోపక్క ‘రాధే శ్యామ్’ నిర్మాతలు పేర్ని నాని వెంట పడుతూ.. తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారట.
కానీ ఆల్రెడీ పాస్ చేసిన జీవోని కనీసం నెలరోజుల వరకు రివైజ్ చేయడం కుదరదు అని జగన్ ప్రభుత్వం వీరి ప్రపోజల్ ను తిరస్కరిస్తున్నట్టు సమాచారం. చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!