పెద్ద సినిమాలకు ఏపీ దెబ్బ!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో RRR టాప్ లిస్టులో ఉంది అని చెప్పవచ్చు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా నటించగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్యాన్ షోలు బెనిఫిట్ షో ల హడావుడి కూడా సోషల్ మీడియాలో మొదలయ్యింది. తెలంగాణలో అయితే ఫ్యాన్స్ షోలకు ఎలాంటి అభ్యంతరం లేదు అని టాక్ అయితే గట్టిగానే వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే తరహాలో వాతావరణం కనిపిస్తుందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అయితే ఆ విషయంలో తప్పకుండా చర్చలు జరుపుతామని అన్నారు. అంతేకాకుండా టికెట్ల ధరలు కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని మాత్రం ఆ విషయంలో ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఇప్పట్లో అయితే వెరిఫికేషన్ లకు పెద్దగా ఆస్కారం ఉండదు అని చాలా క్లారిటీ గా తెలియజేశారు దీంతో అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. త్రిబుల్ ఆర్ సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడం కంటే కూడా బెనిఫిట్ షో లకి వెళ్ళాలి అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎక్కువ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

సినిమాలు విడుదయ్యే ఒకరోజు ముందే థియేటర్స్ లో అభిమానుల సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి బెనిఫిట్ షోలు ఉండవు అని తెలియడంతో కొంత నిరాశ నెలకొంది. మరి ఈ విషయంలో చిత్ర నిర్మాతలు సినీ పెద్దలు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు లేదో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus