Ap Ticket Prices: సినిమా టికెట్‌ రేట్ల పెంపు… పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం.. తగ్గుతాయా? పెరుగుతాయా?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల పంచాయితీ గురించి కాస్త క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే.. కొన్నేళ్లు వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు రావాలి. లేకపోతే పరిస్థితి అర్థం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రేదశ్‌ కాస్త విడిపోయి.. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాడ్డాక తెలుగుదేశం ప్రభుత్వం టికెట్ల రేట్లు విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అప్పటివరకు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక హఠాత్తుగా 10 ఏళ్ల క్రితం రేట్లు పెట్టేశారు. అంటే ఊళ్లలో థియేటర్లలో రూ.10 టికెట్లు కూడా పెట్టారు. దీంతో పరిశ్రమ చాలా ఇబ్బందులు పడింది.

Ap Ticket Prices

దీనిపై పలువురు సినిమా పెద్ద నటుల నిరసనలు, కొన్ని కామెంట్లు, చతుర్లు – విసుర్లు జరిగాక వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సాధారణ టికెట్ రేట్లు పెట్టింది. దానికితోడు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న విధానాన్ని చూసి, సినిమా నిర్మాతల రిక్వెస్ట్‌లతో విడుదలైన కొన్ని రోజులు టికెట్‌ రేటు పెంపునకు ఏర్పాట్లు చేసింది. అయితే దీనికి కొన్ని లంకెలు పెట్టింది. సినిమా షూటింగ్‌లో కొంతమేర ఏపీలో ఉండాలి. బడ్జెట్‌ ఎక్కువగా పెట్టి ఉండాలి లాంటి పాయింట్లు పెట్టింది. ఇక ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక.. ఈ విధానంలోని నియమాలను పక్కనపెట్టి డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్ల పెంపు ఇచ్చింది.

దీంతో ఏపీలో టికెట్‌ రేట్లపై కొంత ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అలాగే ప్రతిసారి నిర్మాతలు వెళ్లి టికెట్‌ రేటు పెంపు గురించి రిక్వెస్ట్‌లు చేయాల్సి వస్తోంది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. టికెట్ రేట్ల పెంపు విషయంలో ఇప్పుడున్న విధానం స్థానంలో కొత్త ఆలోచనలు చేస్తున్నారట. వాటిలో బడ్జెట్‌, షూటింగ్‌ లాంటి అంశాలు ఉండవు అని సమాచారం. ప్రతి సినిమాకు టికెట్ రేటు పెంపు విధానం వర్తింపజేసేలా చూస్తున్నారట.

తెలంగాణలో టికెట్ రేటుకు గరిష్ఠంగా రూ295 (పన్నులు, ఛార్జీలు కలపకుండా) పెట్టుకోవచ్చు అనే జీవో గతంలో ప్రభుత్వం ఇచ్చింది. మరిప్పుడు ఏపీలో ఇలాంటి ఆలోచన ఏమైనా చూస్తారా అనేది చూడాలి. అంటే ఇకపై టికెట్‌ రేట్లు పెంపు నిర్మాతలు, థియేటర్ల చేతుల్లో ఉంటుంది. అయితే అద గరిష్ఠంగా రూ.295 ఉండొచ్చు. దీనికి పన్నులు, ఛార్జీలుఉ అదనం.

ప్రెస్‌మీట్‌లకు వస్తే అరిగిపోతారా? టాలీవుడ్ కొత్త ట్రెండ్‌.. హీరోల్లోని ప్రెస్‌ మీట్‌లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags