ఏపీ ప్రభుత్వం అటువైపు నుండి వస్తోందా…

  • December 23, 2021 / 06:07 PM IST

సినిమాలు X ఏపీ ప్రభుత్వం… గత కొన్ని రోజులుగా ఆసక్తికరంగా సాగుతున్న ఈ పోరు మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. అయితే ఈసారి స్టెప్‌ ప్రభుత్వం వైపు నుండి. అయితే అది డైరెక్ట్‌గా కాకుండా,. ఇన్‌డైరెక్ట్‌గా జరుగుతోందని తెలుస్తోంది. నిబంధనల పేరుతో ఈ స్టెప్‌ వేస్తున్నారని టాక్‌. సినిమా టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35ను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ కొట్టివేసిన విషయం తెలిసిందే. దీని కోసం కొన్ని థియేటర్ల యజమానులు, పంపిణీదారులు కోర్టు మెట్లెక్కారు.

సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాలు చేస్తూ, ఏపీ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కి వెళ్లింది. అక్కడ పూర్తిస్థాయి తీర్పు రావాల్సి ఉంది.ఈలోగా టికెట్‌ ధరల నిర్ణయం స్థానిక జాయింట్‌ కలెక్టర్‌కు న్యాయస్థానం అప్పగించింది. థియేటర్ల యజమానులు టికెట్‌ ధరల విషయం జేసీ ముందుకు తీసుకొచ్చి పర్మిషన్‌ తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు దీని కోసం కమిటీ కూడా ఏర్పాటు చేయాలని సూచిస్తుంది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. ఈలోపు థియేటర్ల మీద వేరే దారిలో పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తోందని టాక్‌.

ఇప్పటికే ప్రభుత్వం నుండి ఈ దిశగా కొన్ని చర్చలు మొదలయ్యాయని టాక్‌. ‘పుష్ప’ సినిమా విడుదలైన తొలి రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని థియేటర్ల మీద అధికారులు దాడులు చేశారని వార్తలొచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. తాజాగా కృష్ణా జిల్లాలో 12 థియేటర్లను సీజ్‌ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా సిద్ధమైనట్లు సమాచారం కృష్ణా జిల్లాలో సుమారు వంద థియేటర్లు ఉన్నాయి.

వీటిలో కొన్నింటికి లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయలేదు. వాటిపైనే ప్రభుత్వం ఇప్పుడు చర్యలకు సిద్ధమవుతోంది. అయితే కేవలం ఈ ఆలోచనతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందా అనే చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ ఊరుకొని ఇప్పుడు చర్యలకు ఉపక్రమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరోవైపు మల్టీప్లెక్స్‌లో తినుబండారాల ధరల విషయంలో కూడా ప్రభుత్వ అధికారులు దృష్టి పెడుతున్నారట. ప్రేక్షకులతో ఈ విషయమై మాట్లాడి వివరాలు తీసుకుంటున్నారట. టాయిలెట్లు శుభ్రంగా లేవని ప్రేక్షకులు తెలిపారని అధికారులు చెబుతున్నారు. దీంతో వారిపై కూడా చర్యలు తప్పనిసరి అంటున్నారు. చూస్తుంటే ఈ పరిస్థితి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వచ్చేలా ఉంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus