Vakeel Saab: జగన్ ప్రభుత్వంపై పవన్ ఫ్యాన్స్ ఫైర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ ముంగిట ఏపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిజానికి పెద్ద హీరోలు నటించిన సినిమాలు రిలీజైన తొలివారం టికెట్ రేట్లను పెంచుకోవడం ఏపీ, తెలంగాణాలో ముందు నుండి నడుస్తుంది. గతంలో ఈ విషయంలో ప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చుకునేవారు. కానీ కరోనా బ్రేక్ తరువాత సీన్ మారిపోయింది. ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ సర్కారు కూడా ఈ విషయంలో సుముఖంగానే కనిపించింది.

ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమా ‘క్రాక్’, ‘ఉప్పెన’, ‘రంగ్ దే’ వంటి పేరున్న సినిమాలకు రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను పెంచుకున్నారు. కానీ ‘వకీల్ సాబ్’ విషయంలో ఏపీ ప్రభుత్వం బయ్యర్లు, ఎగ్జిబిటర్లను ఇబ్బంది పెడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరోనా నేపథ్యంలో ఏపీలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు, స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇవ్వలేదు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కానీ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇబ్బంది లేకపోయింది. ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో రేట్లు పెంచే టికెట్లు అమ్మారు.

కానీ విడుదలకు ముందు రోజు మాత్రం ఏపీ రెవెన్యూ అధికారులు ఎగ్జిబిటర్లకు బ్రేకులు వేశారు. రేట్లు పెంచి టికెట్లు అమ్మడానికి వీల్లేదని తేల్చేశారు. ఎవరైనా అలా చేస్తే థియేటర్లు మూసేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో పరిస్థితి గందరగోళంగా మారడంతో చాలా థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. మిగిలిన సినిమాలకు అనుమతి ఇచ్చి.. ‘వకీల్ సాబ్’ లాంటి భారీ సినిమాకి ఇలా ఇబ్బందులు సృష్టించడం పట్ల పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం కావాలనే ఇలా పవన్ సినిమాకి ఇబ్బందులు కలిగిస్తుందంటూ మండిపడుతున్నారు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus