Shyamala: ఆ జాగ్రత్త ముందే ఉంటే.. ఇంతవరకు వచ్చేది కాదుగా..!

టాలీవుడ్ యాంకర్ శ్యామల (Shyamala) .. ఎన్నికల టైంలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వైసీపీ తరఫున ఆమె ప్రచారం చేసింది. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంకి కూడా వెళ్ళొచ్చింది. ఈ క్రమంలో సహజంగానే ఆమె వద్ద పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తావన వచ్చింది. తాను సపోర్ట్ చేస్తున్న పార్టీకి ప్రమోట్ చేస్తే సరిపోయేది.. కానీ చాలా చోట్ల శ్యామల నోరుపారేసుకుంది. నక్క, తోడేలు, కుందేలు అంటూ ఏంటేంటో కథలు చెప్పి.. కూటమి మద్దతుదారులకు ముఖ్యంగా జనసేన అభిమానులకి యాంటీగా మారింది.

అక్కడితో ఆగలేదు ‘పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎవరికీ మంచి చేయడం నేను చూడలేదు. పవన్ కళ్యాణ్ గెలిచే ఆస్కారమే లేదు’ అంటూ జోస్యం చెప్పింది. ఫైనల్ గా కూటమి ఘన విజయం సాధించింది. జనసేన కూడా 21 సీట్లకి 21 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత శ్యామల పై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ‘ఎళ్ళిపోకే శ్యామల.. నువ్వు ఎల్లమాకే శ్యామల’ అంటూ ‘అఆ’ సినిమాలోని పాటతో ఆమెను ఓ రేంజ్లో ర్యాగింగ్ చేశారు.

ఈ క్రమంలో ‘కక్ష్య సాధింపు చర్యలు వద్దు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటతో సేఫ్ అయిపోవాలని చూసింది. పాపం అది కూడా వర్కౌట్ కాలేదు. మరోపక్క శ్యామలకి ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై ఆఫర్లు రావడం లేదు. ఇండస్ట్రీలో చిరంజీవిని, (Chiranjeevi) మెగా ఫ్యామిలీని అభిమానించేవారు ఎక్కువ. ఆ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి అయినా సరే… శ్యామలని ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ క్రమంలో శ్యామలకి అసలు విషయం తెలిసొచ్చింది.

తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘జనాలు సంక్షేమ పథకాలకు మొగ్గు చూపుతారు అనుకున్నాను కానీ అభివృద్ధి వైపే మక్కువ చూపారు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన ఈవెంట్లు వంటివి హోస్ట్ చేసే అవకాశాలు కూడా రావడం లేదని.. అది ఒక ఫ్యామిలీ వల్లే జరిగిందా లేక ఇంకెవరి హస్తమైనా ఉందా? అనేది తనకు తెలీదని అభిప్రాయపడింది శ్యామల. ఏదేమైతేనేం ‘శ్యామలకి బుద్ధొచ్చింది.. నోరు అదుపులో పెట్టుకుంటే ఇంకా మంచిది’ అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus