కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అపరిచితుడు’. వి.రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తన ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించాడు. ‘శివపుత్రుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యాడు విక్రమ్. అయితే అతనికి తెలుగులో మార్కెట్ ఏర్పడేలా చేసిన చిత్రం ‘అపరిచితుడు’ అనే చెప్పాలి.అప్పటి నుండీ విక్రమ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికీ ‘అపరిచితుడు’ చిత్రాన్ని బుల్లితెర పై చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. 2005 వ సంవత్సరం జూన్ 17న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 16 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి తెలుగులో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.22 cr |
సీడెడ్ | 3.62 cr |
ఉత్తరాంధ్ర | 2.12 cr |
ఈస్ట్ | 0.92 cr |
వెస్ట్ | 0.89 cr |
గుంటూరు | 1.35 cr |
కృష్ణా | 1.07 cr |
నెల్లూరు | 0.52 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 13.71 cr |
‘అపరిచితుడు’ తెలుగు వెర్షన్ కు రూ.6.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.13.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా బయ్యర్లు రూ.7.01 కోట్ల భారీ లాభాలను ఆర్జించారు. దీంతో ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని చెప్పొచ్చు.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?