Appu Yojana Health Scheme: మంచి మనసు చాటుకున్న పునీత్ కుటుంబం… అప్పు యోజన హెల్త్ స్కీం ప్రారంభం!

కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి చెప్పాల్సిన పనిలేదు నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అక్టోబర్ 29 2021 గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. అప్పటివరకు జిమ్ లోపెద్ద ఎత్తున కసరతులు చేస్తున్నటువంటి ఈయన ఒక్కసారిగా గుండెపోటుకి గురై కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించే లోపే ఈయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ పునీత్ లేరనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈయన వెండితెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు ఎన్నో వృద్ధాశ్రమాలు అనాధాశ్రమాలు గోశాలలు నిర్మించడమే కాకుండా ఎంతో మంది అనాధ చిన్నారుల బాధ్యతలను తీసుకొని గొప్ప మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే పునీత్ గుండెపోటుతో మరణించడంతో తమ కుటుంబంలాగా మరొక కుటుంబం బాధపడకూడదన్న ఉద్దేశంతో పునీత్ కుటుంబ సభ్యులు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వంతో కలిసి అప్పు యోజన హెల్త్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించారు.

పునీత్ రాజ్‌కుమార్ పేరుతో క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఒక (Appu Yojana Health Scheme) హెల్త్ స్కీం ప్రారంభం అయ్యింది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు తెలిపారు. గుండెపోటుతో బాధపడుతూ ఆకస్మిక మరణాలు జరగకుండా ఆపడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.ఈ పథకానికి పునీత్ రాజకుమార్ కుటుంబ సభ్యులు అందించిన డబ్బుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించింది. ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాకుండా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ విమానాశ్రయం మాల్స్ వంటి రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్లను (AED) ఉప‌క‌ర‌ణాల‌ను అందుబాటులోఉంచ బోతున్నారు.

ఎవరైనా గుండెపోటుకి గురైతే ఈ పరికరాల ద్వారా వారికి ప్రతిమ చికిత్స అందించి గంట వ్యవధిలోపు వారిని ఆసుపత్రికి తరలించడంతో వారు మరణానికి గురి కాకుండా ఉంటారు. మరి AED ఏర్పాటు చేసేందుకు రెండు వారాల్లోగా టెండ‌ర్ల‌ను ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలిపారు.ఇలా పునీత్ మరణించిన ఆయన సేవా కార్యక్రమాలను ఆయన గుర్తుగా తమ కుటుంబ సభ్యులు నిర్వహిస్తూ మరికొందరు ప్రాణాలను కాపాడటానికి ముందుకు వచ్చారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus