Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మోహన్ లాల్, సమర్ జిత్ లంకేష్ (Hero)
  • రాగిణి ద్వివేది, నయన్ సారిక (Heroine)
  • అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, అలీ, వినయ్ వర్మ తదితరులు (Cast)
  • నందకిషోర్ (Director)
  • శోభా కపూర్ - ఏక్తా కపూర్ - సి.కే.పద్మకుమార్ - వరుణ్ మాధుర్ - సౌరభ్ మిశ్రా - అభిషేక్ ఎస్.వ్యాస్ - ప్రవీర్ సింగ్ - విశాల్ గుర్నాని - జూహీ పరేఖ్ మెహతా (Producer)
  • సామ్ సి.ఎస్ (Music)
  • అంటోనీ సామ్ సన్ (Cinematography)
  • కే.ఎం.ప్రకాష్ (Editor)
  • Release Date : డిసెంబర్ 25, 2025
  • కనెక్ట్ మీడియా - బాలాజీ టెలిఫిలింస్ - అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ (Banner)

మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం “వృషభ”. రష్మిక మందన్న హీరోయిన్ గా “పొగరు” అనే సినిమా తెరకెక్కించిన నందకిషోర్ ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం మీద పెద్దగా అంచనాలు లేవు. మరి సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Vrusshabha Movie Review

కథ: ఆదిదేవ్ (మోహన్ లాల్)కు ఉన్నట్లుండి గత జన్మ స్మృతులు గుర్తుకొస్తుంటాయి. ఎవరినో చంపినట్లు, ఎవరి తలో తన పక్కనే ఉన్నట్లు పదే పదే కలగంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడు.

తండ్రి సమస్య తీర్చడం కోసం కొడుకు తేజ్ (సమర్ జిత్), దామిని (నయన్ సారిక)తో కలిసి దేవనగరికి వెళ్తారు. అక్కడ తేజ్ కి కూడా గతం గుర్తుకురావడం మొదలవుతుంది.

అసలు ఏమిటా గతం? ఎందుకని ఆదిదేవ్ & తేజ్ లను ఆ గతం వెంబడిస్తుంది? వాళ్ల ప్రస్తుతాన్ని ఈ గతం ఎలా ఎఫెక్ట్ చేసింది? దాన్నుండి ఎలా బయటపడ్డారు? అనేది “వృషభ” కథాంశం.

నటీనటుల పనితీరు: మోహన్ లాల్ ఈ సినిమాలో హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. సినిమా మొత్తం ఆయన ఎందుకో కథకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తాడు.

సమర్ జిత్ కి నటుడిగా నిలదొక్కుకోవడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకాస్త బెటర్ స్టోరీ సెలక్ట్ చేసుకోవాలి.

నయన్ సారిక ఎప్పట్లానే ఎక్స్ ప్రెషన్స్ తో అలరించినా.. ఆమె పాత్ర వల్ల సినిమాకి యాడ్ అయ్యింది ఏమీ లేకపోవడంతో, ఆమె క్యారెక్టర్ ఎలివేట్ అవ్వలేదు.

రాగిణి ద్వివేది చాలారోజుల తర్వాత ఒక పెద్ద సినిమాలో కనిపించింది. ఆమె పాత్ర బాగున్నా.. నిడివి తక్కువ ఉండడంతో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.

అలీ, అజయ్, గరుడ రామ్, బలగం సంజయ్ తదితరులు అలా వచ్చి వెళ్లిపోతూ ఉంటారు.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా చాలా వీక్ సినిమా ఇది. ఆ గ్రాఫిక్స్, AI శివుడు, యుద్ధ రంగంలో వచ్చే బ్యాగ్రౌండ్ లు చాలా పేలవంగా ఉన్నాయి. సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం కొంతవరకు పర్వాలేదు కానీ.. పెద్దగా ఎలివేట్ చేయలేదు.

ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్, కాస్ట్యూమ్స్ ఏదీ కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగా లేవు. ఎందుకో చుట్టేశారు అనే భావన కలుగుతుంది.

దర్శకుడు నందకిషోర్ ఒక రెగ్యులర్ కథకి పునర్జన్మల కాన్సెప్ట్ ను యాడ్ చేసి అనవసరంగా కథనాన్ని నానా ఇబ్బందులుపెట్టి, ప్రేక్షకులు కూడా ఇబ్బందిపడేలా చేశాడు. ఒక దర్శకుడిగా, కథకుడిగా ప్రేక్షకుల్ని అలరించడంలో నందకిషోర్ విఫలమయ్యాడు.

విశ్లేషణ: ఏదైనా సినిమాకి కొన్ని మైనస్ పాయింట్లు ఉండడం అనేది సర్వసాధారణం. ఆ మైనస్ లను సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ కవర్ చేస్తుంటాయి. కానీ.. “వృషభ” సినిమాలో బూతద్దం పెట్టి వెతికినా ఒక్క ప్లస్ పాయింట్ కనిపించదు. 127 నిమిషాల సినిమా కూడా బోర్ కొట్టడం, అది కూడా మోహన్ లాల్ లాంటి నటుడు ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం ఈస్థాయిలో ఫెయిల్ అవ్వడం అనేది ఈమధ్యకాలంలో జరగలేదు. అలా ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించలేక చతికిలపడిన సినిమాగా “వృషభ” మిగిలిపోయింది.

ఫోకస్ పాయింట్: ఎందుకు లాల్ సాబ్ ఈ విషప్రయోగం?

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus