ఏ.ఆర్.మురుగదాస్ ఒక స్టార్ డైరెక్టర్ కానీ ఈ ఇప్పుడు ఆ ఇమేజ్ చాలా వరకు తగ్గినట్టే కనిపిస్తుంది.తమిళ దర్శకుడు అయినప్పటికీ మురుగదాస్ సినిమాలని ప్రతీ భాషలోని ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. ఇప్పటికీ పాన్ ఇండియా సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు. కానీ మిడ్ రేంజ్ దర్శకులకి దక్కినన్ని ఆఫర్లు కూడా ఈయనకి దక్కడం లేదు. పాండి రాజ్, ఆనంద్ శంకర్ వంటి మిడ్ రేంజ్ దర్శకులను నమ్మిన హీరోలు కూడా మురుగదాస్ ను నమ్మడం లేదు.
దీని అంతటికీ కారణం ఏంటి? అన్ని చెన్నై మీడియా వర్గాలను ఆరా తీస్తే.. ప్రేక్షకుల అంచనాలను ఆయన మ్యాచ్ చేయకపోవడం వల్ల ఆయన సినిమాలు పరాజయం పాలవ్వడమే అని చెప్పుకొస్తున్నారు. తుపాకి తో అదిరిపోయే రేంజ్ హిట్ కొట్టారు మురుగదాస్. తమిళ్ లో శంకర్ తర్వాత రూ.100 కోట్ల సినిమాలను అందించిన ఘనత ఈయనకే సొంతం. విజయ్ వంటి హీరో ఇమేజ్ పాతాళానికి పడిపోయినప్పుడు ‘తుపాకి’ ‘కత్తి’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్లు ఇచ్చి మళ్ళీ ఫామ్లోకి తెచ్చిన ఘనత కూడా ఈయనకే సొంతం.
దాంతో మురుగదాస్ ఇమేజ్ మరింత పెరిగింది. పారితోషికం కూడా భారీ స్థాయిలో ఆయన డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈయన తీసే సినిమాలకి కాపీ ఆరోపణలు రావడం, కేసులు నమోదవ్వడం, దాంతో ఎన్నో వివాదాలు ఏర్పడడం వంటివి జరగడంతో మురుగదాస్ ఇమేజ్ కాస్త డౌన్ అయ్యింది. దానికి తోడు ఆయన తెరకెక్కిన ‘స్పైడర్’ ‘దర్బార్’ సినిమాలు కూడా ఘోర పరాజయాలు చవిచూడడం వంటివి కూడా ఈయన స్టార్ స్టేటస్ ను దెబ్బ తీశాయి. మధ్యలో సర్కార్ సినిమా పర్వాలేదు అనిపించినప్పటికీ దాని క్రెడిట్ మొత్తం విజయ్ స్టార్ ఇమేజ్ కు వెళ్ళిపోయింది.
ఇప్పుడు మురుగదాస్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఏ హీరో సిద్ధంగా లేడు. టాలీవుడ్లో అల్లు అర్జున్, ప్రభాస్ లను కలిసిన మురుగకి వాళ్ళు ఓకె చెప్పలేదు. మలయాళం, హిందీ భాషల్లో కూడా అదే పరిస్థితి. చివరికి కన్నడ స్టార్ హీరో యష్ ను కలిసి కూడా ఓ కథ చెప్పినా.. ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో మురుగకి చేదు అనుభవం తప్పలేదు. ఇప్పట్లో అయితే ఏ స్టార్ హీరో ఖాళీగా లేడు. తమిళంలో అయితే మిడ్ రేంజ్ హీరోలు కూడా ఈయనకి మొహం చాటేస్తున్నారు అని వినికిడి. పాపం.. మురుగకి ఎంత కష్టం వచ్చి పడింది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!