ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ..గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన గురించి ప్రపంచమంతా తెలుసు. ఆయన సంగీతంలో రూపొందిన ఎన్నో పాటలు.. మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయి.30 ఏళ్లుగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇప్పటికీ పాన్ ఇండియా సినిమాలకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈయనకి ఒక్క రిమార్క్ కూడా లేదు. అయితే కెరీర్ లో మొదటిసారి ఈయన విమర్శలు ఎదుర్కొన్నాడు. అది కూడా ఆయన అభిమానుల నుండే కావడం అందరికీ షాకిచ్చే అంశం.
విషయం ఏంటంటే.. ఇటీవల చెన్నైలో ఈయన ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొన్నారు. రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ అంటే ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి. అందుకే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. అయితే నిర్వహకుల ప్లానింగ్ అస్సలు బాలేదు. ఈ షోకి టికెట్ కొన్న వారికి సైతం లోపలి రావడానికి అనుమతి లభించలేదు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది కొందరిని కొట్టడం, దూషించడం , చాలా మందిని వెనక్కి పంపించేయడం జరిగింది.
ఇందుకే రెహమాన్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఆయన అభిమానులు. ఇది రెహమాన్ కూతుర్లు.. క్షితిజ, రహీమాలకి కోపం తెప్పించింది. ఈ క్రమంలో వారు “మా నాన్న చేసిన సేవా కార్యక్రమాలు ఇవి,” అంటూ ఒక లిస్ట్ ని పోస్ట్ చేసి.. అందరినీ మందలించే ప్రయత్నం చేశారు. వీళ్ళ కోపం కరెక్ట్ అవ్వొచ్చు కానీ.. అప్సెట్ అయితే అభిమానులు ఆమాత్రం ఆగ్రహం చూపించడంలో తప్పు లేదుగా.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!