విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బన్నీ. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఉద్దేశంతో బన్నీ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లోనే నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం అల్లు అరవింద్ వందకోట్లు కేటాయించినట్లు తెలిసింది.ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లేను ఒక ప్రముఖ బాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్ చేత రాయిస్తున్నట్లు సమాచారం.
సినిమాకి యాక్షన్ సీన్స్ కీలకం కాబట్టి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌ని ఈ ప్రాజెక్ట్‌కి ఎంపిక చేశారు. తాజాగా ఈ సినిమాకి సంగీతదర్శకుడిగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ని తీసుకోవాలని చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. అతన్ని కలవడం, కథ వినిపించడం జరిగిపోయాయంట. అతను అంగీకారం కోసమే బన్నీ టీమ్ ఎదురుచూస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాకి సంగీతం అందిస్తానని ఒప్పుకొని తర్వాత రెహమాన్ హ్యాండ్ ఇచ్చారు. అందుకే అల్లు అర్జున్ చిత్రానికి అతను ఒకే అంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.