మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అందులోనూ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కూడుకున్న మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. అలాంటి సినిమానే ‘అరణ్య ధార’. బాలు నాయుడు,ఆశా సుదర్శన్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘సిల్వర్ స్క్రీన్ షాట్స్’ బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు శివ పచ్చ తో కలిసి దర్శకత్వం కూడా వహించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఓ కొత్త పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్. తాజాగా ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ అయినటువంటి రఘు కుంచెతో లాంచ్ చేయించింది చిత్ర బృందం.
అనంతరం రఘు కుంచె మాట్లాడుతూ.. “ఇప్పుడే ‘అరణ్య ధార’ ఫస్ట్ సింగిల్ అయినటువంటి ‘యుగానికే’ అనే పాట లాంచ్ చేశాను. చాలా బాగుంది. ఈ పాటలో నేచర్ ని బాగా చూపించారు.బాగా షూట్ చేశారు. వింటున్నంత సేపు హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఇందులో హీరో ఒక ఫోటోగ్రాఫర్.తప్పకుండా ఈ చిత్రం.. ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక రవి నిడమర్తి సంగీతంలో రూపొందిన ‘యుగానికే ప్రయాణమే’ పాటని అమన్ సిద్ధికి ఆలపించగా బాలు నాయుడు సాహిత్యం సమకూర్చారు. వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. విజువల్స్ అందంగా ఉన్నాయి. మీరు కూడా చూస్తూ వినండి :