‘జయలలిత బయోపిక్’ లో విద్యాబాలన్ పాత్ర..?
- December 14, 2018 / 12:46 PM ISTByFilmy Focus
ప్రముఖ నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత తమిళ ప్రజల గుండెల్లో ‘అమ్మ’ గా ఆరాధ్య దేవతగా నిలిపోయాయరు. ఆమె సినీ, రాజకీయ అనుభవాలతోను ‘ది ఐరన్ లేడీ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘ఏ స్టోరీ ఆఫ్ రెవొల్యూషనరీ లీడర్’ అనేది టాగ్ లైన్. నిత్య మీనన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రియదర్శిని డైరెక్ట్ చేస్తుండగా ‘పేపర్‌టేల్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తుంది.
ఇదిలా ఉంటె ‘అమ్మ’ జయలలిత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, సమస్యలతో కూడిన కథాంశంగా మరో బయోపిక్ ను కూడా తెరకెక్కించబోతున్నారట. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇక జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనుందట. ఈ చిత్రంలో ‘ఎంజీఆర్’ పాత్రకు ప్రముఖ కోలీవుడ్ నటుడు అరవింద్ స్వామిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘అమ్మ’ జయలలిత జయంతి సందర్బంగా ఫిబ్రవరి 24 న ఈ చిత్రాన్ని లాంచ్ చేయబోతున్నట్టు చెన్నై ఫిలిం వర్గాలు చెప్పుకొస్తున్నాయి.












