నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్
- February 18, 2026 / 04:02 PM ISTByDheeraj Babu
హీరోయిన్లు కెరీర్ ఉన్నన్నాళ్లూ వరుస సినిమాలు చేసి, చేతులారా సంపాదించి, బోలెడన్ని స్థలాలు, ల్యాండ్లు కొనేసి సెటిల్ అయిపోవాలని చూస్తుంటారు. కానీ.. చాలా తక్కువ మంది తాము సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మళ్లీ సినిమాల్లోనే పెడుతూ ఉంటారు. రీసెంట్ గా సమంత, మధుశాలిని అలా నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లో నిత్యామీనన్ కూడా చేరింది. గత కొన్నేళ్లుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి బోలెడంత పేరు, డబ్బు సంపాదించిన నిత్యామీనన్ ఇప్పుడు తన సొంత బ్యానర్ ను స్థాపించింది.
Nithya Menon
“కేయూరీ ప్రొడక్షన్స్” అనే సంస్థ ద్వారా మంచి కథల్ని ప్రేక్షకులకి చేరువ చేయాలి అనేది తన ధ్యేయం అని నిత్యామీనన్ అనౌన్స్ చేసింది. ఆ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇకపోతే.. నిత్యామీనన్ ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తడం అనేది అఫీషియల్ అయినప్పటికీ, అనఫీషియల్ ప్రొడ్యూసర్ గా ఎప్పటినుండో ఉంది. అంటే.. డబ్బులు పెట్టలేదు కానీ, ప్రాజెక్ట్స్ సెట్ చేసేది. “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు” సినిమా కే.ఎస్.రామారావు వద్దకు తీసుకెళ్లింది, క్రాంతి కుమార్ నీ డైరెక్టర్ గా నిలబెట్టింది నిత్యామీనన్.

ఆ తర్వాత కూడా కొందరు దర్శకులకి నిర్మాతలని వెతికి పెట్టడం, కొందరు నిర్మాతలకి ప్రాజెక్ట్స్ సెట్ చేయడం వంటివి చేస్తూనే వచ్చింది నిత్యా. ఇప్పుడు అఫీషియల్ గా నిర్మాతగా మారడం, బ్యానర్ స్టార్ట్ చేయడంతో.. నిర్మాతగా తన అభిరుచి ఎలా ఉండబోతోంది అనేది చూడడం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే.. నిత్యామీనన్ ఎంత పర్టిక్యులర్ గా ఉండి, మంచి కథలు ఎంపిక చేసినప్పటికీ.. వాటిని మార్కెట్ చేయడం పెద్ద సమస్య కాబట్టి, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఆమెకు ఉన్న పరిచయాలకి అది పెద్ద సమస్య కానప్పటికీ.. బ్యానర్ పెట్టింది కాబట్టి వరుస సినిమాలు చేస్తుందా లేక అప్పుడప్పుడు తనకు వీలైనప్పుడు మాత్రమే చేస్తుందా అనేది చూడాలి.
సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్












