కరోనా విసిరిన పంజాకు బలైన రంగాల్లో సినిమా రంగం ఒకటి. పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి సినిమాలు చూస్తే కానీ నడవని రంగమది. ఎప్పుడు ఎటు నుండి దాడి చేస్తోంద తెలియక జనాలు థియేటర్లకు రావడానికి జంకుతున్నారు. తొలి వేవ్ తర్వాత వచ్చి తగ్గాక వచ్చిన రెస్పాన్స్… ఇప్పుడు లేదంటున్నారు సినీ పరిశీలకులు. దాంతోపాటు ఏపీలో పరిస్థితి చూస్తుంటే థియేటర్లు కొనసాగడమూ కష్టమే కారణం అంటున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు కరోనాతో పాటు మరో సమస్య కూడా థియేటర్ల వ్యవస్థను, ఆ మూలంగా సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతోంది.
అదే టికెట్ ధరలు. తెలంగాణలో టికెట్ ధరలు, ఆంధ్రప్రదేశ్ టికెట్ ధరలు చూస్తే ఎలకకు, ఏనుగుకు సాపత్యంలా ఉంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో సినిమా థియేటర్లు నిర్వహిస్తే… నష్టాల ఊబిలో ఏరికోరి దూకినట్లే అని థియేటర్ల యజమానులు భావిస్తున్నారట. జూలై 30న థియేటర్ల ఓపెన్ చేసుకోండి… అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో అని ఏపీ ప్రభుత్వం చెప్పింది. దీంతో కొన్ని థియేటర్లు అక్కడక్కడా ఓపెన్ అయ్యాయి. అయితే సినిమాలకు ప్రజల నుండి పెద్దగా స్పందన రాలేదు.
మరోవైపు ఆక్యుపెన్సీ, టికెట్ ధరల కారణంగా ఓపెన్ చేసిన థియేటర్లకు నష్టాలే కనిపిస్తున్నాయి. దీంతో థియేటర్లు మూసేయాలని అనుకుంటున్నారట. ఈ వారంలో విడుదలయ్యే సినిమాల విషయం చూస్తే… కాస్త కనిపించే పేరు ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’… ఇంకా ఏదో చిన్న సినిమా ఒకటి ఉంది. ఇలాంటి సినిమాలతో థియేటర్లు ప్రజలు వస్తారని అనుకోవడం అత్యాశే. పోనీ పెద్ద హీరోలు వస్తే అవుతుంది కదా అంటే ఏపీలో టికెట్ ధరలు వారిని ఆపుతున్నాయి. దీంతో ఆగస్టు రెండు లేదా మూడో వారంలో థియేటర్లు మళ్లీ క్లోజ్ అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!