బిగ్ బాస్ చరిత్రలో.. అరియానా నెంబర్ 1 రికార్డ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా దాదాపు చాలా మంది ఫేమస్ అయ్యారు. అమ్మాయిలలో ఎక్కువగా అరియానా గ్లోరి బోల్డ్ గర్ల్ గా క్లిక్కయ్యింది. బోల్డ్ గానే ఎంట్రీ ఇచ్చి షోలో ప్రిన్సెస్ గా చలామణి అయ్యింది. ఆమె మొండితనమే మంచి క్రేజ్ అందించింది. కొన్నిసార్లు ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ ఆమె ఓ వర్గం ఆడియెన్స్ సపోర్ట్ తో టాప్ 5 వరకు వెళ్ళింది. బిగ్ బాస్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకే తరహా యాటిట్యూడ్ ను మెయింటైన్ చేసి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

టాప్ 4 కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న అరియానా షో అనంతరం చాలా బిజీ అయ్యింది. ఇంటర్వ్యూలు, షాప్ ఓపెనింగ్స్.. అంటూ రెండు చేతుల సంపాదిస్తోంది. రీసెంట్ గా గోవా వెళ్లి అర్జీవిని కూడా కలిసింది. ఇక రెగ్యులర్ పార్టీలతో కూడా బిజీ అవుతున్న అరియానా సినిమాల్లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక చాలా రోజుల తరువాత అరియానా ఒక అరుదైన గుర్తింపును అందుకుంది.

గూగుల్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ తెలుగు అని టైప్‌ చేయగా అరియానా గ్లోరీ పేరు దర్శనమివ్వడం మొన్నటి వరకు బాగా వైరల్ అయ్యింది. సీరియస్‌లీ అంటూ అరియానా సోషల్ మీడియా ద్వారా కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. బిగ్ బాస్ హిస్టారిలో ఈ ఫీట్ ఇంతవరకు ఎవరు అందుకోలేదు. కానీ ఏమైందో ఏమో గాని గూగుల్ లో ఇప్పుడు అలా చూపించడం లేదు. ఆమె పేరును తొలిగించినట్లు అర్ధమయ్యింది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus