బిగ్ బాస్ హౌస్ లో ఎట్టకేలకి కెప్టెన్ అయ్యింది అరియానా. అందర్నీ కన్విన్స్ చేసి ఇద్దరి సపోర్ట్ తో కెప్టెన్సీని దక్కించుకుంది. మెహబూబ్, అండ్ అమ్మరాజశేఖర్ ఇద్దరూ కూడా అరియానాకి సపోర్ట్ చేశారు. కెప్టెన్ ని చేశారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ, ఎప్పుడైతే అరియానా కెప్టెన్ అయ్యిందో, అప్పుడు మోనాల్ ని రేషన్ మేనేజర్ గా ఎంచుకుంది. ఇక్కడే అమ్మరాజశేఖర్ బాగా హర్ట్ అయ్యారు. అరియానాని సపోర్ట్ చేస్తే తను రేషన్ మేనేజర్ అవుదామని అనుకున్నారు. కానీ, అరియానా తనతో ఈక్వల్ గా గేమ్ ఆడి ఓడిపోయిన మోనాల్ ని రేషన్ మేనేజర్ చేసింది. అంతేకాదు, ఇంతరవకూ మోనాల్ కి ఎటువంటి బాధ్యత బిగ్ బాస్ హౌస్ లో దక్కలేదని ఇది నేను ఇస్తున్నానని కూడా చెప్పింది.
అమ్మరాజశేఖర్ ఈవిషయాన్ని బాగా మనసుకి తీసుకుని అరియానాని సాధించడం స్టార్ట్ చేశారు. కెప్టెన్ అయిన ఆనందం కాసేపు కూడా లేకుండా చేశారు అమ్మ. దీంతో అరియానా బాగా విసిగిపోయింది. నిజానికి కెప్టెన్ రేషన్ మేనేజర్ గా ఎవరినైనా ఎంచుకోవచ్చు. కానీ, అరియానా లాస్ట్ టైమ్ అవినాష్ తో కెప్టెన్సీ టాస్క్ ఆడినపుడు తను ఓడిపోయింది కాబట్టి అవినాష్ తనని రేషన్ మేనేజర్ ని చేశారు. సేమ్ అదే ఫార్ములాని అప్లై చేస్తూ ఇక్కడ మోనాల్ ని రేషన్ మేనేజర్ చేసింది అరియానా.
అయితే, వెంటనే మోనాల్ లాస్ట్ వీక్ పాడైపోయిన ఫ్రూట్స్, వెజిటెబుల్స్ తీస్కుని వచ్చి అవినాష్ కి చూపించింది. లాస్ట్ వీక్ కెప్టెన్ కాబట్టి వీటికి మీరే ఆన్సర్ నేను కాదు అని చెప్పింది అయితే, అంతకుముందే అరియానా మెహబూబ్ ని ఇదే ప్రశ్న అడిగింది. లాస్ట్ వీక్ గ్రాసరీస్ ఎందుకు సరిగ్గా యూజ్ చేయలేదని చెప్పింది. దానికి మెహబూబ్ నా తర్వాత నువ్వు అయినపుడు నీకు వచ్చిన రేషన్ దాచి, నా రేషన్ యూజ్ చేయచ్చుకదా అని చెప్పాడు. ఇక్కడ అరియానా నువ్వు అస్సలు గ్రాసరీస్ సరిగ్గా వాడలేదు అని కన్ క్లూజన్ ఇచ్చి వెళ్లిపోయింది. ఇదే ప్రశ్న మోనాల్ అడిగినపుడు నాకు దీంతో సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయింది అరియానా. అరియానా చేసిన మిస్టేక్ ఇదే.