బిగ్ బాస్ హౌస్ లో అరియానా స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ప్రజామోదన పొందేందుకు ఓపిక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో అరియానా చాలా పట్టుదలగా రోబోలాగా ఎటువంటి ఎక్స్ ప్రెషన్స్ అనేది ఇవ్వకుండా కూర్చుని ఉంది. ఇక్కడే మోనాల్ చేసిన పనికి బాగా హర్ట్ అయ్యింది. ఈరోజు స్ట్రయిట్ ఫార్వర్డ్ గా అడిగేస్తాను అంటూ మోనాల్ పై విరుచుకుపడింది.
తన మాటలతో ఎదుటివారిని మనసు నొచ్చుకునేలా మాట్లాడుతుందని టాస్క్ లో నిరూపించింది అరియానా. నిజానికి మోనాల్ అరియానాకి ఇష్టమైన చింటు అనే టెడ్డీ బేర్ ని పారేసింది. ఇక్కడ ఈవిషయంలో సోహైల్ ఇన్వాల్ మెంట్ కూడా ఉంది. అయినా కూడా అరియనా మోనాల్ ని టార్గెట్ చేసింది. మోనాల్ నాపైన ఇంతలా పగ పెంచుకుంది అని పర్సనల్ గా గేమ్ ఆడుతూ కావాలని పగతీర్చుకుంది అని నిందవేసింది. అంతేకాదు, ఆ తర్వాత మోనాల్ టాస్క్ లో రోబోలా కూర్చున్నపుడు తన మనసులో మాటలన్నీ అడిగి పారేసింది. ఇక్కడ మోనాల్ అవినాష్ విషయంలో చేసిన మిస్టేక్ ని మరోసారి గుర్తుచేస్తూ తనదైన స్టైల్లో క్లాస్ పీకింది. ఇక్కడ వరకూ బాగానే ఉంది.
అయితే, మోనాల్ ఎప్పుడైతే డీప్ డిప్రెషన్ లోకి వెళ్లి ఏడుస్తోందో, అప్పుడు అరియానా చూసి కూడా పట్టించుకోలేదు. బయటకి వెళ్లి మిగతా హౌస్ మేట్స్ ని పిలిచింది. ఇక్కడ తప్పెవరిది అని అడిగితే, ఫస్ట్ పర్సనల్ గా మోనాల్ ఎటాక్ చేసిందా లేదా అనేది బిగ్ బాస్ ఎక్కడా ఆడియన్స్ కి చూపించలేదు. అంతేకాదు, అరియానాని అసలు ఏ విషయంలో టార్గెట్ చేసింది అనేది కూడా క్లియర్ గా వ్యూజవల్ లేదు. సో అందుకే, మోనాల్ ఎలాంటి ఉద్దేశ్యంతో చేసింది అనేది అరియానాకి మాత్రమే తెలుసు కాబట్టి అరియానా మాటలు నిజం అనుకున్నా, మోనాల్ ని అంతలా దెప్పి పొడవాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ లవర్స్ అభిప్రాయం.
అంతేకాదు, సాటి అమ్మాయి డీప్ గా బాధపడుతుంటే, ఏడుస్తుంటే కనీసం వచ్చి సానుభూతిని చూపించలేకపోయింది. ఇది కూడా అరియానా గేమ్ లో ఎంత సీరియస్ గా ఉందో అర్ధం చేసుకోవాల్సి పాయింట్. ఇక్కడ మోనాల్ తన గేమ్ ని ఆడింది. అసలు ఈ బొమ్మని ముక్కలు చేసే ఐడియా వేసింది సోహైల్. కానీ, అరియానా మోనాల్ ని టార్గెట్ చేసింది. ఇక మోనాల్ టాస్క్ లో ఓడిపోయాను అనే బాధ, అరియానాకి సమాధానం చెప్పలేకపోయాను అనే బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది. అదీ విషయం.
[yop_poll id=”1″]
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!