కొత్త డైరక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. గతనెల 25 న విడుదలైన ఈ బోల్డ్ మూవీ అన్ని ఏరియాల్లో భారీ కలక్షన్స్ రాబడుతోంది.భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లో ప్రణయ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యం కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను అర్జున్ రెడ్డి మంచి వసూళ్లను సాధిస్తోంది. 1 .5 మిలియన్ డాలర్లు దాటి ఓవర్సీస్ లో ఈ మార్క్ సాధించిన ఐదవ తెలుగు చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కిన ఈ మూవీ తాజాగా మరో మైలు రాయిని చేరుకుంది.
ఓవర్సీస్ లో ఆదివారం నాటికీ 1. 75 మిలియన్ మార్కును అర్జున్ రెడ్డి దాటింది. స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ మార్క్ ని చేరుకోవడానికి కష్టపడుతుంటాయి. అటువంటిది విజయ్ దేవరకొండ రెండో సినిమాకే ఈ ఫీట్ సాధించారు. గత శుక్రవారం రిలీజ్ అయిన తెలుగు చిత్రాలు అర్జున్ రెడ్డికి పోటీ ఇవ్వకపోవడంతో దూసుకుపోతోంది. పాతికకోట్ల షేర్ అందుకొన్న ఈ సినిమా సెప్టెంబర్ 21 నాటికీ మరింత కలక్షన్ రాబట్టే అవకాశం ఉంది.