అర్జున్ రెడ్డి కంటతడి పెట్టించడం ఖాయం…
- August 23, 2017 / 06:34 AM ISTByFilmy Focus
ఇప్పటివరకూ విడుదలైన “అర్జున్ రెడ్డి” టీజర్, ట్రైలర్ అండ్ పోస్టర్స్ చూసి కొందరు ఇదేదో అడల్ట్ సినిమా అని, ఇంకొందరు ఇదేదో బోల్డ్ సినిమా అని ఫిక్స్ అయితే ఇంకొందరేమో ఇదంతా పబ్లిసిటీ స్టంట్, సినిమాలో అంత విషయం లేదు అంటూ సోషల్ మీడియాలో స్టేట్ మెంట్ లు ఇచ్చేస్తున్నారు. కానీ.. వీళ్ళెవరూ ఊహించని ట్విస్ట్ “అర్జున్ రెడ్డి”లో ఉండబోతోందని తెలుస్తోంది.
175 నిమిషాల నిడివి గల ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో ఆఖరి పది నిమిషాలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించడమే కాదు.. థియేటర్ నుండి వెళ్లే ప్రతి ప్రేక్షకుడు అర్జున్ రెడ్డి పాత్రలో లీనమవ్వడం ఖాయం అంటూ దర్శకనిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతల నమ్మకం ఎలా ఉన్నా.. ప్రస్తుతం సినిమాకి ఏర్పడిన క్రేజ్ చూస్తుంటే.. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమంటూ ట్రేడ్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













