Aishwarya Sarja: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఐశ్వర్య అర్జున్?

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అర్జున్ సర్జా ఒకరు. ఈయన కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు ఇలా హీరోగా వివిధ భాషలలో సినిమాలు చేయడమే కాకుండా దర్శకుడిగా కూడా ఈయన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ అర్జున్ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన తన కుమార్తె ఐశ్వర్యను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు

ఇలా కన్నడ తమిళ భాష చిత్రాలలో హీరోయిన్గా నటించినటువంటి ఐశ్వర్య తెలుగులో కూడా హీరో విశ్వక్ తో కలిసి ఒక సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈమె కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఐశ్వర్య అర్జున్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఈమె (Aishwarya Sarja) ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య తనయుడు తంబి ఉమాపతితో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడమే కాకుండా వీరి ప్రేమకు పచ్చ జెండా కూడా ఊపారట దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. మరి కొద్ది రోజులలోనే వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తోంది. మరి ఐశ్వర్య అర్జున్ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus