‘బిగ్ బాస్ 6’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఆరోహి. ‘టీవీ 9′ ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.’ఇస్మార్ట్ న్యూస్’ చదివే ఆరోహి రావు అలియాస్ అంజలికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వరంగల్ లో ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఆరోహి రావ్, తన చిన్న తనంలో చాలా కష్టాలు పడింది. హౌస్ లో ప్రస్తుతానికైతే సైలెంట్ గానే ఉన్న ఈ అమ్మడు నామినేషన్స్ టైంలో కొంచెం హైలెట్ అయ్యిందని చెప్పాలి.
ఆరోహి లైఫ్ లో చాలా ట్రాజెడీ ఉంది. ఇది ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “నాకు 5 ఏళ్ల వయసున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. దాంతో మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను. నాన్న వేరే పెళ్లి చేసుకుని మాకు దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటి నుండి మమ్మల్ని పట్టించుకోలేదు. నాతో పాటు మా అన్నయ్య కూడా అమ్మమ్మ ఇంట్లోనే పెరిగాడు. చిన్నతనం కూలి పనులు చేసుకుంటూ చదువుకునేదాన్ని.
ఆర్థిక సమస్యల కారణంగా చదువుని మధ్యలోనే ఆపేసాను.నాకు లవ్ కూడా కలిసి రాలేదు. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. మొదట్లో లోకల్ ఛానల్ లో పనిచేసేదాన్ని.అప్పుడు నెలకు నాకు రూ.4000 ఇచ్చేవారు. తర్వాత నటన పై ఇంట్రెస్ట్ ఉండడంతో హైదరాబాద్ వచ్చి షార్ట్ ఫిలిమ్స్ లో నటించాను. తర్వాత యాంకర్ గా మారాను.
వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడ్డాను. గత 3 ఏళ్ళ నుండే నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. రేపటి పరిస్థితి ఏంటి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏడవని రోజంటూ లేదు. గతంలో ఓసారి ఇద్దరు అబ్బాయిలు బైక్ పై వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంటే.. ఆ బైక్ ను ఒక్క తన్నుతన్నాను. అప్పుడు ఓ అబ్బాయి కాలు విరిగింది. తర్వాత వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చింది ఆరోహి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!