కోలీవుడ్ హీరోని పెళ్ళాడనున్న… అఖిల్ హీరోయిన్..!

టాలీవుడ్ లో ‘అఖిల్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది సాయేషా. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో సాయేషాకు టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ వైపు దృష్టి పెట్టింది. నేచురల్ స్టార్ నాని – మారుతీ కంబినేషన్లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని కోలివుడ్ లో ఆర్యతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ‘గజినీకాంత్’ పేరుతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఆర్య సరసన సయేషా హీరోయిన్ గా నటించింది. దీనితో పాటు కార్తీ నటించిన ‘చినబాబు’ చిత్రంలో కూడా నటించింది.

అయితే ‘గజినీకాంత్’ చిత్ర హీరో ఆర్యతో సాయేషా ప్రేమాయణం సాగిస్తుందని గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని… తొందరలోనే వీరు పెళ్ళి చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనంటూ ఇప్పుడు ఓ వార్త బయటకొచ్చింది. త్వరలోనే సాయేషా- ఆర్య పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట. ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్ళి కి అంగీకరించారట. ప్రస్తుతం ఆర్య కే.వి.ఆనంద్ డైరెక్షన్లో ‘కాప్పాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల సాయేషా తల్లి ‘కాప్పాన్’ సెట్స్ కి వెళ్లి ఆర్యని కలిసినట్టు సమాచారం. ఇక్కడి వరకూ బాగానే ఉన్నప్పటికీ .. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్య వయసు 38 కాగా.. సాయేషా వయసు కేవలం 21 మాత్రమే.. దాదాపు వీరిద్దరి మధ్య 17 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉండడం గమనార్హం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus