రీ- రిలీజ్ సినిమాల హవా ఇంకా తగ్గలేదు. ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు, అండర్ రేటెడ్ అనుకున్న సినిమాలు..4Kకి డిజిటలైజ్ చేసి రీ- రిలీజ్ చేస్తే భారీ వసూళ్లు వస్తున్నాయి. కొత్త సినిమాల రేంజ్లో ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి. చిరంజీవి ‘ఇంద్ర’, బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
అయితే సీనియర్ హీరోల్లో వెంకటేష్, నాగార్జున..ల రీ-రిలీజ్..లు ఇంకా ఏ రికార్డులు క్రియేట్ చేయకపోవడంతో ఆ హీరోల అభిమానుల కొంత డల్ అయ్యారు. వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు రీ- రిలీజ్ అయ్యాయి. అందులో ఏదీ సరైన వసూళ్లు సాధించలేదు. ఆల్ టైం సూపర్ హిట్ అయిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా కొత్త సంవత్సరం కానుకగా 2026 జనవరి 1న రీ- రిలీజ్ కానుంది. అది కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.
ఇక నాగార్జున కెరీర్లో ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచిన ‘శివ'(Shiva) కూడా రీ- రిలీజ్ అయ్యింది.నవంబర్ 14న రీ- రిలీజ్ అయిన ‘శివ’ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద విజృంభించింది. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.2.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇది నాగార్జున రీ- రిలీజ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డు అనే చెప్పాలి.
అన్ సీజన్లో రీ- రిలీజ్ అయినప్పటికీ.. కొత్త సినిమాలైన ‘కాంత’ ‘సంతాన ప్రాప్తిరస్తు’ వంటి కొత్త సినిమాలను కూడా బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేసి ట్రేడ్ పండితులకి సైతం షాకిచ్చింది ‘శివ’ చిత్రం.