తెలుగు తెరపై ఫ్యాషన్ స్టైలిస్ట్
- May 27, 2016 / 05:17 AM ISTByFilmy Focus
తెలుగు తెరకు మరో బ్యూటీ పరిచయం కాబోతోంది. “వల్లా వనుక్కు పుల్లుమ్ అయుధమ్”, “ఇనిమె ఇప్పదితాన్” తమిళ్ సినిమాల్లో సంతానం పక్కన నటించిన ఆష్నాజవేరీ తెలుగు సినిమా కోసం మేకప్ వేసుకోనుంది. ఈమె ఇదివరకు బాలీవుడ్ తార అనుష్క శర్మతో కలిసి పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. స్వతహాగా ఫ్యాషన్ స్టైలిస్ట్ అయిన ఈ భామ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి సిద్ధ మవుతోంది.
అందాల రాక్షసి, త్రిపుర, లచ్చిమి దేవికి ఓ లెక్కుంది.. సినిమాలలో నటించి మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నవీన్ చంద్ర రీసెంట్ గా బుర్రకథ సినిమాకు సంతకం చేశాడు. ఇందులో నవీన్ చంద్ర కు జోడీగా యంగ్ హీరోయిన్ ఆష్నా జవేరీ ని చిత్ర బృందం ఫైనల్ చేసింది. వీరిద్దరి కాంబినేషన్ కొత్త లుక్ ని తీసుకొస్తుందని ఆశిస్తోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












