అశోక పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న , మొదటి చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్…

అశోక పిక్చర్స్ బ్యానర్ పై అమర్నాథ్ రెడ్డి గుంటక ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ…ఆర్. కె .రెడ్డి నిర్మాణ సారథ్యంలో…. ఇన్స్పిరేషనల్ 1980’S పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో నిర్మితమౌతున్న చిత్రం “గగన వీధి” .ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో పాటు టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది . ఈ సందర్భంగా *చిత్ర దర్శకుడు అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ…. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మా చిత్ర కథాంశానికి వస్తే… “యువత తలుచుకుంటే.. ఏదైనా చేయ్యగలదనే” చక్కటి మెసేజ్ తో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం.

ఇందులో అశ్వినీదత్ బ్యానర్లో వచ్చిన మెయిల్ చిత్రంలో నటించి మంచి హిట్ కొట్టిన యువ కథానాయకుడు హర్షిత్ రెడ్డి హీరోగా, ఎన్నో చిత్రాల్లో నటించి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న, సింధూరపువ్వు రాంఖీ, సినిమా బండి లో లీడ్ రోల్ చేసి అత్యుత్తమ ప్రదర్శన కనపరచిన వికాస్ వశిష్ఠ, నారప్ప లో చిన్నప్ప పాత్రలో చిన్నకొడుకుగా నటించిన రాఖీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.చిత్రం పూజ కార్యక్రమాలతో పాటు టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. త్వరలో డీఫ్రెంట్ ప్రమోషన్ తో మీ ముందుకు వస్తున్నాము. మా చిత్రాన్ని మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నామని అన్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus