Ashwini Dutt: అశ్వినీదత్ కాన్ఫిడెన్స్ అదే అయ్యుంటుందా..నిజమైతే ఫ్యాన్స్ కి పండగే.!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ (Indra)  ఇటీవల రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ టైంలో థియేటర్లో చూడలేకపోయిన ఇప్పటితరం మెగా అభిమానులు 4K లో.. ఆ చిత్రాన్ని వీక్షించి ఎంజాయ్ చేశారు. ఆ విధంగా ‘ఇంద్ర’ రీ – రిలీజ్ లో కూడా సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద రూ.3.5 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిన ఘనత మెగాస్టార్..కే చెందింది.

Ashwini Dutt

ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీదత్ (C. Aswani Dutt) తో  పాటు ‘ఇంద్ర’ దర్శకుడు బి.గోపాల్ (B. Gopal)   , సంగీత దర్శకుడు మణిశర్మ (Mani Sharma) , రైటర్స్ అయినటువంటి పరుచూరి బ్రదర్స్ (పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) , పరుచూరి వెంకటేశ్వరరావు (Paruchuri Venkateswara Rao)) , చిన్ని కృష్ణ  (Chinni Krishna) వంటి వారు వెళ్లి..చిరుని కలిసి సత్కరించారు.దీనికి సంబంధించిన వీడియోను ‘ఇంద్ర భవనంలో సత్కారం’ పేరిట యూట్యూబ్లో విడుదల చేసింది ‘వైజయంతి..’ సంస్థ. ఇందులో భాగంగా అశ్వినీదత్ (Ashwini Dutt) ‘ఇంద్ర’ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్స్ తీసి చిరు రుణం తీర్చుకుంటానని చెప్పడం జరిగింది. ‘ఇంద్ర’ అనేది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన మూవీ.

ఆ జోనర్లో సినిమాలు చేస్తే ఇప్పట్లో కష్టమే. కానీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా ఎవర్గ్రీన్. ఆ సీక్వెల్ గురించి మెగా అభిమానులు ఇప్పటికీ ట్విట్టర్ వేదికగా డిస్కషన్లు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. రాంచరణ్  (Ram Charan)  , జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  ..లు ఈ సీక్వెల్ లో చేస్తే చూడాలని.. వారు కలలు కంటున్నారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) వంటి దర్శకుడు తలుచుకుంటే.. ఈజీగా వర్కౌట్ అయ్యే విషయమే ఇది. సో అశ్వినీదత్ (Ashwini Dutt) కూడా అదే కాన్ఫిడెన్స్ తో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై స్పందించి ఉండవచ్చు.

కళ్యాణ్ రామ్ లైనప్ బాగుంది.. వర్కౌట్ అయితే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus