Puneeth Rajkumar: వెండితెరపై పునీత్ ను చూసి ఎమోషనల్ అయిన అశ్విని.. ఏమైందంటే?

కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లో ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించాయి. పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు సంవత్సరాలు కాగా భౌతికంగా ఆయన మరణించినా తమ మనస్సులో మాత్రం ఆయన జీవించి ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ నటించిన జాకీ సినిమా కర్ణాటకలో రీరిలీజ్ కాగా 120కు పైగా స్క్రీన్లలో ఈ సినిమా రీరిలీజ్ కావడం గమనార్హం. ఈ నెల 17వ తేదీన పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాను రీరిలీజ్ చేయడం జరిగింది. పునీత్ మరణం తర్వాత ఆయన నటించి రీరిలీజ్ అయిన తొలి సినిమా కావడంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు వేశారు.

ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఫ్యాన్స్ తో పాటు పునీత్ భార్య అశ్విని కూడా హాజరయ్యారు. 2021 సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన పునీత్ రాజ్ కుమార్ మృతి చెందారు. వెండితెరపై తన భర్తను చూసిన అశ్విని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జాకీ మూవీ 2010 సంవత్సరంలో థియేటర్లలో విడుదలై అప్పటి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో పునీత్ కు జోడీగా భావన నటించారు.

పునీత్ రాజ్ కుమార్ రీల్ హీరో మాత్రమే మాత్రమే కాదని రియల్ హీరో అని అందుకే ఆయనకు ఈ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేసిన మరో హీరో లేరని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను తలచుకుని ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus