“అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అసిన్ ను ఎవరు మర్చిపోతారు చెప్పండి. ఆ తర్వాత “శివమణి, గజిని, ఘర్షణ, అన్నవరం” లాంటి సూపర్ హిట్ సీనిమాల్లో నటించిన అసిన్ ఆ తర్వాత బాలీవుడ్ పయనమై అక్కడ కూడా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోస్ తో కలిసి నటించింది. అయితే.. కెరీర్ మాంచి పీక్ స్టేజ్ లో ఉండగా.. తన సహనటుడు మరియు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన స్నేహితుడు మరియు వ్యాపారవేత్త అయిన రాహుల్ శర్మాతో అసిన్ కు దగ్గరుండి మరీ స్నేహబంధం కుదర్చడమే కాక పెళ్లి కూడా చేశాడు. మైక్రోమ్యాక్స్ కంపెనీ సి.ఈ.ఓ అయిన రాహుల్ శర్మతో అసిన్ వివాహం 2016లో జరిగింది.
నిన్న సాయంత్రం (అక్టోబర్ 24) అసిన్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కూడా ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది అక్షయ్ కుమారే. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తిపలికిన అసిన్ వయసు ఇప్పుడు 31 సంవత్సరాలు. ఎలాగూ పాప పుట్టేసింది కాబట్టి, ఇప్పటివరకూ భార్య పొజిషన్ ను ఎంజాయ్ చేసిన అసిన్ ఇకనుంచి మాతృత్వాన్ని కూడా అనుభవించి.. మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.