‘కార్తీక దీపం’ ఫేమ్ నిరుపమ్.. ఆస్తుల వివరాలు..!

నిరుపమ్ పరిటాల..ఇలా చెబితే ప్రేక్షకులకు పెద్దగా అర్ధంకాక పోవచ్చు…. అదే డాక్టర్ బాబు అంటే అందరికీ అర్ధమవ్వడమే కాదు.. వంటలక్క,మోనిత వరకు వెళ్ళిపోతారు. అంతలా ఈ పాత్రలకు క్రేజ్ ఏర్పడింది. ‘కార్తీక దీపం’ సీరియల్ బుల్లితెర పై ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక నిరుపమ్..విషయానికి వస్తే దివంగత నటుడు, రచయిత అయిన ఓంకార్ గారి తనయుడు అన్న సంగతి తక్కువ మందికే తెలిసుండొచ్చు.

గతంలో పలు చిత్రాలతో పాటు ‘ఇది కథ కాదు’ ‘పవిత్ర బంధం’ వంటి సీరియల్స్ లో కూడా నటించారు ఓంకార్ గారు. ఆయన కాలం చేసాక నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు ఎంతో కష్టపడి సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. కుటుంబ బాధ్యతలని కూడా చేపట్టాడు. అయితే నిరుపమ్ వరుస సీరియల్స్ తో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నాడు. మరి ఇతనికి ఎంత ఆస్తి ఎంత ఉండొచ్చు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ‘కార్తీక దీపం’ సీరియల్ కు గాను నిరుపమ్ రోజుకి రూ.22 వేలు పారితోషకం అందుకుంటున్నాడని సమాచారం.దాంతో పాటు మరో రెండు, మూడు సీరియల్స్ లో కూడా ఇతను నటిస్తున్నాడు.వాటికి ఎంత వరకు తీసుకుంటాడు అనేదాని పై స్పష్టత లేదు.

డా.బాబుకు వైజాగ్ లో రూ.5 కోట్ల విలువగల ప్రాపర్టీ కూడా ఉందని వినికిడి.అంతేకాదు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో భువన అపార్ట్ మెంట్స్ లో రూ.80లక్షల విలువగల ఖరీదైన ఫ్లాట్ కూడా ఉంది. వీటితో పాటు రూ.11లక్షల విలువగల కారు కూడా ఉంది. నిరుపమ్ భార్య ముంజుల కూడా సిరీయల్స్ లో నటిస్తుంది కాబట్టి వీరి ఆస్తులు ఇంకా ఎక్కువే ఉండి ఉండొచ్చు అని అంచనా.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus