ఈ వయసులో ఈమెకు హీరోయిన్ ఛాన్సులు వస్తాయా..?

హీరోయిన్లకు ఇండస్ట్రీలో చాలా తక్కువ టైం ఉంటుంది. ఉన్న టైంను మాగ్జిమమ్ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక వాళ్ళ టైం అయ్యాక పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోతుంటారు. ఒక వేళ వాళ్ళకి ఇంకా సినిమాలు చేయాలి అనే ఉద్దేశం ఉంటే గనుక హీరోలకి అక్క పాత్రలు.. అమ్మ పాత్రలు చేస్తుంటారు. ఇలా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. రమ్యకృష్ణ, నదియా వంటి వారు సక్సెస్ సాధించిన వారి లిస్ట్ లో ఉన్నారు.కానీ ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం అక్క, తల్లి పాత్రలు చేయదంట.

గతంలో కొన్ని హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన లయ.. మంచి క్రేజ్ నే సంపాదించుకుంది. ‘స్వయంవరం’ ‘ప్రేమించు’ ‘మనోహరం’ వంటి సినిమాల్లో ఈమె నటన అందరికీ గుర్తుండిపోతాయి అనడంలో సందేహం లేదు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సందర్భంలో ఓ ఎన్నారైను పెళ్ళి చేసుకుని యూ.ఎస్ లో సెటిల్ అయిపొయింది. ఈ క్రమంలో సినిమాలను తగ్గించేసింది. కొన్నేళ్ళ గ్యాప్ తరువాత ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో నటించినా.. ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడైతే కేవలం కథా ప్రాధాన్యత ఉండే సినిమాలు మాత్రమే చేస్తుందట. అంటే ఆమె ఇండైరెక్ట్ గా హీరోయిన్ అవకాశం అడుగుతున్నట్టే.. ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. 40 ఏళ్ళ వయసు మీదపడబోతుంటే.. ‘ఈమెకు హీరోయిన్ అవాకాశాలు ఎక్కడ వస్తాయి.. వచ్చినవి చేసుకుని ముందుకు వెళ్ళాలి కానీ’ అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus