Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

మహేష్ బాబు, రాజమౌళి కలయికలో రూపొందుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ గ్లొబ్ ట్రోటర్ మూవీ ‘వారణాసి’. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించి మరీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. అయితే ఈ ఈవెంట్ ఫెయిల్ అయినట్టు అంతా చెప్పుకుంటున్నారు. సరైన విధంగా ఈవెంట్ జరగలేదని.. టైటిల్ రివీల్ వీడియోకి కూడా సరైన విధంగా ఆదరణ లభించలేదు అనేది చాలా మంది అభిప్రాయం.

Varanasi

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. వీడియో స్క్రీనింగ్ టైంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి అనే ఫ్రస్ట్రేషన్లో రాజమౌళి హనుమంతునిపై విమర్శలు చేశాడు. తాను దేవుడిని నమ్మను అంటూ రాజమౌళి కామెంట్స్ చేశాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనమైంది. హిందూ పండిట్..లు పోలీస్ కేసు పెట్టే వరకు వెళ్ళింది వ్యవహారం. ఇదిలా ఉండగానే.. మరో వివాదంలో రాజమౌళి చిక్కుకున్నట్టు తెలుస్తుంది.

విషయం ఏంటంటే.. మహేష్- రాజమౌళి సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్ పెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే దీనికి వారం పది రోజుల ముందే మరో చిన్న సినిమా యూనిట్ తమ సినిమాకి ‘వారణాసి’ టైటిల్ పెట్టుకున్నట్టు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేసింది. ఛాంబర్లో ఆ టైటిల్ ని రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగిందట. ఆ లెటర్ తో రాజమౌళి పై ఛాంబర్లో ఫిర్యాదు చేశాడు ఆ సినిమా నిర్మాత.

దీంతో రాజమౌళికి మరో చిక్కు వచ్చి పడినట్టు అయ్యింది. ఇప్పుడు రాజమౌళి ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి టైటిల్ మార్చుకోవడం. రెండోది ఆ చిన్న సినిమా మేకర్స్ వద్ద టైటిల్ హక్కులు కొనుగోలు చేయడం. వాళ్ళు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. మహేష్- రాజమౌళి సినిమాకి టైటిల్ ఎలాగూ మార్చలేరు. ఆల్రెడీ అది జనాల్లోకి వెళ్ళిపోయింది. కథను బట్టి ఆ టైటిల్ కావాలని రాజమౌళి ఏరి కోరి దాని ఫైనల్ చేయడం జరిగింది.

కాబట్టి.. ఆ చిన్న సినిమా మేకర్స్ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చి టైటిల్ తీసుకోవడమే..! గతంలో మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమా టైటిల్ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.

ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus