Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 7 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 2018లో వచ్చిన ‘ధడక్’ అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చింది. ఆ సినిమా బాగానే ఆడింది. నటిగా జాన్వీకి మంచి పేరు వచ్చింది. తర్వాత కూడా కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసింది. అయితే టాలీవుడ్లో డెబ్యూ ఇచ్చేందుకు ఆమె చాలా టైం తీసుకుంది.

Peddi

మొత్తానికి ఆమె జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో ఆమె టాలీవుడ్ కి డెబ్యూ ఇచ్చింది. కానీ ఆమె అఫీషియల్ గా మొదట సైన్ చేసిన తెలుగు మూవీ ‘పెద్ది’ అని చాలా మందికి తెలీదు. కానీ ఈ సినిమా ‘గేమ్ ఛేంజర్’ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది.ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి చాలా మందిలో ఉంది.

ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ లో జాన్వీ కపూర్ గ్లామర్ కూడా బాగా హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పాత్ర పోషిస్తుంది. అయితే ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ కి ఓ టాలీవుడ్ నటి డూప్ గా నటిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు బాంధవి శ్రీధర్. ‘మాసూద’ సినిమాలో సంగీత కూతురిగా అంటే దెయ్యం పాత్రలో ఆమె నటించింది.

తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ లో కూడా ఆమె నటించింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు, వీడియోలు యువతని అమితంగా ఆకట్టుకుంటూ ఉంటాయి.ప్రస్తుతం ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ కి డూప్ గా బాంధవి నటిస్తున్నట్టు స్పష్టమవుతుంది. జాన్వీ కపూర్ హైట్,ఫిజిక్ కి చాలా దగ్గరగా ఉండే అమ్మాయి కాబట్టి బాంధవి శ్రీధర్ ని జాన్వీ డూప్ గా ఎంపిక చేసుకుని ఉండవచ్చు.

అలాగే ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది. మరోపక్క ఆమె జానీ మాస్టర్ తో కలిసి ‘చికిరి చికిరి’ పాటకు చేసిన కవర్ సాంగ్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కల్ట్ ప్రేమకథల సరసన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. ఆ డైరక్టర్‌ నమ్మకం చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus