ఒకానొక టైంలో సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ‘జబర్దస్త్’ కమెడియన్ గా అతను రాణిస్తున్న టైంలో… వేరే ఛానల్స్ కి సంబంధించిన షోలలో కూడా అతనికి ఆఫర్లు వచ్చాయి. వాటిలో అతని స్టైల్ చూసి ఇంప్రెస్ అయిపోవడం వల్లనో..లేక అతని డౌన్ టు ఎర్త్ మెంటాలిటీ నచ్చడం వల్లనో.. ఏమో కానీ అతనికి మంచి క్రేజ్ ఏర్పడింది. అది ఏ రేంజ్లో అంటే.. సినిమాల్లో హీరోగా ఆఫర్లు పొందే రేంజ్లో అని చెప్పాలి.
మొదటి ప్రయత్నంగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ చేశాడు. అది బాగానే కలెక్ట్ చేసింది. తర్వాత ‘గాలోడు’ చేశాడు. ఇది మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘హైలెస్సో’ అనే పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు ‘గాలోడు’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
ఈ సందర్భంగా ఆ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 1.91 cr |
| సీడెడ్ | 0.93 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.24 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 5.08 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.25 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 5.33 కోట్లు(షేర్) |
‘గాలోడు'(Gaalodu) చిత్రం రూ.2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా 5.33 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్లకు రూ. 2.63 కోట్ల లాభాలు పంచింది.అనేక సార్లు వాయిదా పడి ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది గొప్ప విషయమే.