Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

అల్లు అర్జున్‌ – అట్లీ సినిమా అనూహ్యంగా లీకై.. ఆ తర్వాత కన్‌ఫామ్‌ అయింది. ఈ క్రమంలో మరో సినిమా వేరే హీరో దగ్గరకు వెళ్లిపోయింది. ఆ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు అట్లీ మాటలు వింటుంటే మరో అనూహ్యమైన ఇన్ఫర్మేషన్‌ బయటకు వస్తోంది అనిపిస్తోంది. ఎందుకంటే మీ అందరూ ఎంజాయ్‌ చేసే అప్‌డేట్‌ వస్తోంది అని చెబుతున్నారు మరి ఆయన. ఇటీవల అట్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రేక్షకులు ఆశ్చర్యపోయే ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు కూడా తెలిపారు.

Atlee

బెంగళూరులో జరిగిన పికిల్‌ బాల్‌ టోర్నమెంట్‌కు అట్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే AA 22 (అల్లు అర్జున్‌ – అట్లీ సినిమా) ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడారు. ఏదైనా సరే ఒక్క ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. అలా ఈ సినిమా కూడా మొదలైంది. మేం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాం. మా ప్రయాణంలో ప్రతి అడుగులోనూ దేవుడు తోడున్నాడు. ఆయన దయ వల్ల మేం అనుకున్నట్లే జరుగుతుందని ఆశిస్తున్నాను అని అట్లీ చెప్పుకొచ్చాడు.

భారీ ప్రాజెక్ట్‌ అందులోనూ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో తెరకెక్కుతున్న సినిమా కదా.. ఏమన్నా రిస్క్‌ అనుకుంటున్నారా అని అడిగితే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించడం రిస్క్‌ అనుకోవడం లేదు. ఎంజాయ్‌ చేస్తూనే సినిమా చేస్తున్నాను. మరి కొన్ని నెలల్లో మీరు కూడా ఆస్వాదిస్తారు అని అట్లీ తెలిపారు. మరి అట్లీ చెప్పింది సినిమా కోసమా? లేక సినిమా నుండి ఏమన్నా అప్‌డేట్‌ వస్తుందా అనేది చూడాలి. సినిమా నుండి ఇప్పటివరకు ఫస్ట్‌ లుక్‌ మేకింగ్‌ గ్లింప్స్‌ మాత్రమే వచ్చాయి. విదేశాల్లో కొన్ని టెస్ట్‌ లుక్‌ వీడియోలు వచ్చాయి. వాటి ఒరిజినల్‌ అవుట్‌పుట్‌ని ఏమన్నా త్వరలో రిలీజ్‌ చేస్తారేమో చూడాలి.

ఘనంగా నార్నె నితిన్‌ వివాహం.. వీడియోల్లో తారక్‌ని చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus